వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీ లేదు: తెలంగాణ తీర్మానం ఓటమికే కిరణ్ రెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే విషంయలో రాజీ లేని పోరాటం లేని పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. విభజనకు అనుకూలంగా కేంద్రం వేసే ముందడుగును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన భావిస్తున్నటు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేనిపక్షంలో అసెంబ్లీలో తీర్మానం వస్తే దానిని నెగ్గించేందుకు తా ను ఏమీచేయలేనని ఢిల్లీలో పార్టీ పెద్దలకు స్పష్టంచేసినట్లు తెలిసింది.

బుధవారం ఏ.కె.ఆంటోని కమిటిని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ను, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండేను కలిశారు. చివరగా, రాష్టప్రతి ప్రణభ్‌ ముఖర్జీని కూడా ఆయన కలిశారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలో కొనసాగు తున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురించి తన భేటీల్లో అధిష్టానం పెద్దలకు వివరించినట్లు సమాచారం. పార్టీలకతీతంగా ప్రజలుస్వచ్ఛందంగా సమై క్య ఉద్యమంలో పాల్గొంటున్నారని, ఇందులో ఏపిఎన్‌ జిఓలు మరింత కీలకంగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ పార్టీ పెద్దలకు కిరణ్‌ వివరించారు.

Kiran Kumar Reddy

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆయా ప్రాం తాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని చెప్పారు. పార్టీ బతకాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కిరణ్‌ కుమార్ రెడ్డి సూచన చేసినట్లు సమాచారం. పార్టీ హైకమాండ్‌ పెద్దల మాటలు, మూడ్‌ను బట్టి అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వచ్చే అవకాశం కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అంచనా వేస్తోంది. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనే అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఇందుకోసం ఆయన సీమాంధ్రలోని 175 మం ది ఎమ్మెల్యేలకు పార్టీలకతీతంగా ఈ బిల్లు ఓడించాలని వర్తమానం పంపే అవకాశముందని సమాచారం. ఇదే సందర్బంలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. విభజన ఖాయం అని తెలిస్తే కిరణ్‌ తన పదవిని వదులుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే రాష్టప్రతితో భేటీ సందర్భంగా విభజన నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించినట్లు సమాచారం.

English summary
It is said that CM Kiran kumar Reddy has prepared to defeat Telangana resolution in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X