వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రోడ్డున పడ్డారు. ఎప్పటికప్పుడు పార్టీ
అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ముందుకు వస్తున్నట్లే కనిపిస్తూ వెనక్కి పోవడం వారి పట్ల శాపంగా మారింది. ఒక్క క్షణం తీరిక లేకుండా, ప్రశాంతత లేకుండా తమనే టార్గెట్ చేసుకుని తెలంగాణ ఆందోళకారులు పోటెత్తడం వారికి పెద్ద సమస్యగా మారుతోంది.

ప్రజల వైపు ఉన్నామని చెప్పుకోవడానికి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనాల్సిన పరిస్థితి వారిని ఇరకాటంలో పడేస్తోంది. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆందోళనలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ఆందోళనకారులు వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. వారి వ్యతిరేకత నుంచి తమను తాము రక్షించుకుంటూ, తాము తెలంగాణ కోసం ఎంత వరకైనా పోతామని ప్రకటించుకోవడం వారికి ఆనవాయితీగా మారింది.

తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంలోనూ వారు తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కున్నారు. అలాగే, తెలంగాణ మార్చ్ సందర్భంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట బైఠాయించారు. అరెస్టయ్యారు. రైల్ రోకోలో పాల్గొని అరెస్టయ్యారు. తాజాగా, హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ సమర దీక్షకు వచ్చిన పొన్నం ప్రభాకర్, వివేక్, కె. కేశవరావు తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు.

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

తెలంగాణ ఉద్యమంలో అధికార పార్టీ నాయకులమనే విషయం కూడా మరిచిపోయి చురుగ్గా పాల్గొనాల్సి వస్తోంది. దీంతో పోలీసుల నుంచి తిప్పలు తప్పడం లేదు.. పొన్నం ప్రభాకర్ ఇలా..

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

ఎక్కే మెట్టు దిగే మెట్టులాగా తెలంగాణ పార్లమెంటు సభ్యుల పరిస్థితి తయారైంది. తెలంగాణ కోసం అధిష్టానం పెద్దల చుట్టూ తిరుగుతూ తెలంగాణ కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడం కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు ఆనవాయితీగా మారింది.

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

నిజంగానే, తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రోడ్డు పడ్డారు. పార్లమెంటు సభ్యుడు రాజయ్య పరిస్థితి ఇది...

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

పార్లమెంటు సమావేశాల సందర్బంగా ఇలా తెలంగాణ కోసం నినాదాలు చేస్తూ... ధర్నా చేస్తూ....

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

ఎక్కడికి వెళ్లినా జై తెలంగాణ నినాదాలు చేస్తూ... తెలంగాణ సాధన కోసమే ఉన్నామంటూ...

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

తెలంగాణ మార్చ్ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట తెలంగాణ ఎంపీల బైఠాయింపు ఇలా...

టీ - కాంగ్రెసు ఎంపీలు రోడ్డున పడ్డారు (ఫోటోలు)

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ... ఇలా అరెస్టవుతూ.. ఎంపి వివేక్‌కు కూడా తప్పలేదు.

ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాటకు విలువ లేకపోవడంతో, తెలంగాణ పరిష్కారానికి మరింత సమయం కావాలని గులాం నబీ ఆజాద్ ప్రకటించడంతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు మరింతగా చిక్కుల్లో పడ్డారు. రాజీనామాలు చేయాలని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. గత నెల 28వ తేదీన జరిగిన అఖిల పక్ష సమావేశం వరకు తెలంగాణ ఆందోళనకారులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా లక్ష్యంగా ఉంటూ వచ్చారు. అఖిల పక్ష సమావేశం తర్వాత కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే తెలంగాణ ఉద్యమకారుల లక్ష్యంగా మారింది.

ఓ వైపు రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు, మరో వైపు తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర సమస్యను ఎదుర్కుంటున్నారు. పార్టీ అధిష్టానం తెలంగాణ పార్లమెంటు సభ్యుల అవస్థను అర్థం చేసుకునే స్థితిలో కూడా లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

English summary
Telangana Congress MPs are facing opposition from Telangana agitators time to time. At Present Congress leaders are the main target in Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X