వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైపోల్స్: జగన్‌ ఉత్సాహంపై నీళ్లు, కిరణ్‌కు ఊరట

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉత్సాహంపై ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లేట్లుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఊరట లభిస్తుంది. తన వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు పడడం ద్వారా ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని వైయస్ జగన్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే, ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఉప ఎన్నికలను నిర్వహించకపోవచ్చు. ఉప ఎన్నికలను ఆహ్వానించడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డికి పరీక్ష పెట్టాలనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యూహానికి కూడా దెబ్బ తగిలే అవకాశాలున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై శానససభలో అవిశ్వాస తీర్మానం విషయంలో పార్టీల విప్ ధిక్కరించిన 18 మంది శాసనసభ్యులకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసనసభ్యులు తొమ్మిదేసి మంది ఉన్నారు. మార్చి 30వ తేదీన తాను జారీ చేసిన నోటీసులకు శాసనసభ్యులు వివరణ ఇచ్చిన తర్వాత వారిని ఒక్కరినొక్కరిని పిలిచి స్పీకర్ మాట్లాడుతారు.

ఆ తర్వాత శాసనసభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 18 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యంగా మారుతాయి. శానససభ రద్దుకు ఏడాది కూడా కన్నా తక్కువ గడువు ఉండడంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికలకు ఏడాది కన్నా తక్కువ గడువు ఉన్న స్థితిలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సెక్షన్ 151(ఎ) చెబుతోంది.

కాగా, స్పీకర్ జారీ చేసిన నోటీసులు తమకు అందలేదని శాసనసభ్యులు చెబుతున్నారు. వారు నోటీసులు అందుకుని, స్పీకర్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంకా చాలా సమయమే పడుతుంది. అందువల్ల శానససభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని అంటున్నారు.

కాంగ్రెసుకు చెందిన గొట్టిపాటి రవికుమార్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, బి. శివప్రసాద్ రెడ్డి, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, సిహెచ్ రాజేష్, పేర్ని నాని, జోగి రమేష్‌లకు, తెలుగుదేశం పార్టీకి చెందిన అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, కొడాలి వెంకటేశ్వర రావు (నాని), చిన్నం రామకోటయ్య, తానేటి వనిత, పి. సిరాజ్, కె. హరీశ్వర్ రెడ్డి, ఎస్ వేణుగోపాలాచారిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

English summary

 YSR Congress party president YS Jagan intension will be defeated regarding bypolls.Meanwhile, Chief minister N Kiran Kumar Reddy can heave a sigh of relief with sources in the Election Commission of India indicating that there would be no more bypolls in the state until the assembly elections next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X