సురేఖ, రోజా డల్: జయలిద్దరు వస్తారా? (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మహిళా నేతల కొరత వచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీకి పెద్ద దిక్కుగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ప్రచార రథసారథిగా జగన్ సోదరి షర్మిల ఉన్నప్పటికీ మిగతా మహిళా నేతలు చాలా మంది చురుగ్గా వ్యవహరించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి చోటా మేమ్మున్నామంటూ వాలిపోయే ప్రముఖ నటి రోజా, కొండా సురేఖ ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
రోజా, కొండా సురేఖ తీవ్రమైన అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. రోజా గతంలో మాదిరిగా చురుగ్గా వ్యవహరించడం లేదు. ఎప్పుడో ఓసారి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా పార్టీలో ఉన్నానని చెబుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శానససభ్యురాలు శోభానాగిరెడ్డి పార్టీ శానససభ్యులకు మార్గనిర్దేశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆమె వ్యక్తిగత వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారనే మాట వినిపిస్తోంది.
గతంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఏదో ఒక విషయం మీద ఘంటాపథంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతుండేవారు. ఇప్పుడు ఆమె పూర్తిగా షర్మిల వెంట పాదయాత్రలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైయస్ జగన్ పార్టీకి మరింత మంది మహిళా నేతల అవసరం ఏర్పడిందని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని భావించిన మాజీ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు చురుగ్గా వ్యవహరించడం లేదు. తెలంగాణలో తనకు కాకుండా వేరే నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఆమె అలిగినట్లు చెబుతున్నారు. ఆమె వరంగల్‌లోని పార్టీ కార్యాలయానికి కూడా ఎప్పుడో ఓసారి మొక్కుబడిగా వెళ్తున్నట్లు చెబుతున్నారు. మీడియా సమావేశాలను తన నివాసంలోనే ఏర్పాటు చేస్తున్నారు.

ప్రముఖ నటి రోజా నోటి వాటం ఉన్న మహిళా నేత. వైయస్ జగన్‌కు మద్దతుగా ఆమె గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుండేవారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండేవారు. ఇప్పుడు ఆమె పలుకే బంగారమన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీవీ షోల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి వ్యక్తిగత వ్యవహారాల్లో కూరుకుపోయినట్లు చెబుతున్నారు. పార్టీ శానససభ్యులకు ఆమె మార్గనిర్దేశం చేయడానికి ముందుంటున్నారు. కానీ, అనుకున్నంత మేరకు పార్టీకి సేవలు అందించలేకపోతున్నారని అంటున్నారు.

పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు పూర్తిగా షర్మిల వెంట పాదయాత్రలో ఉంటున్నారు. ప్రత్యర్థులపై ఏకధాటిగా వాగ్బాణాలను సంధించే ఆమె వినిపించడం లేదు.

పార్లమెంటు సభ్యురాలు జయప్రద పార్టీలోకి వస్తే పార్టీకి గ్లామర్ వచ్చేస్తుంది. ఆమె రాజమండ్రి లోకసభ టికెట్ కోసం పట్టుబట్టి కూర్చున్నట్లు చెబుతున్నారు. ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా, లేదా అనేది చెప్పలేని స్థితి.

ఇక, జయసుధ రాజకీయాలతో పూర్తిగా విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు. తొలుత వైయస్ జగన్‌కు మద్దతు పలికిన జయసుధ ఇప్పుడు కాంగ్రెసులో ఉంటున్నారు. కాంగ్రెసులో కూడా ఆమె అంత బాగా ఉన్నట్లు లేరు. ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా, లేదా అనేది చెప్పలేని స్థితే.
పార్లమెంటు సభ్యురాలు జయప్రద, శానససభ్యురాలు జయసుధను పార్టీలోకి ఆహ్వానిస్తే మంచిదనే మాట వినిపిస్తోంది. జయప్రద రాజమండ్రి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో వైయస్ జగన్ నుంచి ఆమెకు పూర్తిస్థాయిలో హామీ రావడం లేదని అంటున్నారు. ఇక, జయసుధ మొదట్లో వైయస్ జగన్ రాజకీయాలకు మద్దతు ప్రకటించారు. ఎందుకో గానీ ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరలేదు. పైగా, జగన్‌కు దూరమయ్యారు.












Click it and Unblock the Notifications