వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: దర్యాప్తు అధికారికి పొడగింపు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సిబిఐ హైదరాబాద్ రేంజ్ డిఐజి హెచ్ వెంకటేష్ డిప్యుటేషన్‌ను పొడగిస్తారనే మాట వినిపిస్తోంది. ఈ మేరకు గురువారం వార్తలు వచ్చాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయన ప్రధాన దర్యాప్తు అధికారిగా పనిచేస్తున్నారు.

కేరళ క్యాడర్ ఐపియస్ అధికారి వెంకటేష్ సిబిఐ హైదరాబాద్ రేంజ్‌కు డిప్యుటేషన్‌పై 2009లో వచ్చారు. ఆయన డిప్యుటేషన్ కాల పరిమితి ఆగస్టు 16వ తేదీతో ముగుస్తుంది. జగన్ ఆస్తుల కేసు దర్యాప్తును పూర్తి చేసి సెప్టెంబర్ 8వ తేదీలోగా చార్జీషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ స్థితిలో వెంకటేష్ డిప్యుటేషన్‌ను పొడగించవచ్చునని అంటున్నారు.

జగన్ ఆస్తుల కేసులో మిగతా ఆంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయడానికి వెంకటేష్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు ఐదు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, కోల్‌కతా సూట్‌కేసు కంపెనీల వంటి ఏడు అంశాలపై సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది.

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దర్యాప్తు సాగుతున్నప్పుడు వెంకటేష్ డిప్యూటేషన్‌పై హైదరాబాద్ వచ్చారు. ఆ కేసులో ఆయన అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కావస్తోంది. ఎమ్మార్ కుంభకోణం కేసు, ఓఎంసి కేసు వంటి దర్యాప్తుల్లో కూడా ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్‌ వివి లక్ష్మినారాయణకు ఆయన సహకరిస్తూ వచ్చారు.

లక్ష్మినారాయణ ఇటీవల తన మాతృసంస్థకు తిరిగి వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్‌కు ఇంచార్జీ జాయింట్ డైరెక్టర్ మాత్రమే పర్యవేక్షకుడిగా ఉన్నారు. దీంతో వెంకటేష్ డిప్యూటేషన్ గడువును పొడిగించవచ్చునని అంటున్నారు.

English summary
According to media reports - The deputation of H Venkatesh, DIG, CBI, Hyderabad range, who is also the chief investigating officer in the illegal assets case involving YSR Congress chief Y S Jaganmohan Reddy, is likely to be extended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X