ఎలా?: జగన్ పార్టీ 'టి' నేతల సైలెన్స్, కినుక!

దీంతో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పైనే ప్రధానంగా విరుచుకుపడిన తెలంగాణవాదులు ఇప్పుడు జగన్ పార్టీ పైన మండిపడుతున్నారు. అదే సమయంలో టిడిపి పట్ల సుముఖంగా కనిపిస్తున్నారు. అయితే అన్ని పార్టీలు అఖిల పక్షంలో(అధికార కాంగ్రెసు మినహా) స్పష్టమైన అభిప్రాయం చెప్పాయి. జగన్ పార్టీ చెప్పినప్పటికీ ఆ అభిప్రాయం సొంత పార్టీ నేతలను, కార్యకర్తలనే మెప్పించలేక పోయిందని అంటున్నారు.
అందుకే నేతలు అప్పటి నుండి మౌనంగా ఉంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆ పార్టీ తెలంగాణ నేతలు అధిష్టానం పైన కినుక వహించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై పార్టీ ఏదో చెబుతుందని ఇన్నాళ్లు సవాళ్లు చేస్తూ వచ్చామని కానీ, చివరకు తామే టార్గెట్‌గా మారామని ఆవేదన చెందుతున్నారట. గతంలో తెరాస, తెదేపా, కాంగ్రెసు పార్టీలకు సవాళ్ల పైన సవాళ్లు విసిరిన నేతలు ఇప్పుడు అందుకే కనిపించడం లేదని అంటున్నారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంతంలో మొగ్గ తొడుగుతున్న పార్టీకి అఖిల పక్ష సమావేశం ద్వారా గట్టి దెబ్బ తగిలిందనే భావనలో తెలంగాణ నేతలు ఉన్నారట. పార్టీ వైఖరి మరికొంత క్లియర్‌గా ఉంటే బాగుండునన్న భావన వారిలో కనిపిస్తోందని అంటున్నారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ తాజా వ్యాఖ్యల వెనుక జగన్ కుట్ర ఉందని, తెలంగాణ అడ్డుకోవడానికి ఆయన జైలు నుండే పావులు కదుపుతున్నారని, మజ్లిస్‌ను అందుకు పావుగా ఉపయోగించుకుంటున్నారని తెరాస విమర్శలు కూడా చేస్తోంది.












Click it and Unblock the Notifications