అనురాధ హత్య కేసులో చింటూ: కొత్త కోణాలు
చిత్తూరు: చిత్తూరు మేయరు కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు విచారణలో ప్రధాన నిందితుడు చింటూ వెల్లడించిన విషయాలతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు సమాచారం.
మేయర్ దంపతులను హత్య చేసేన తర్వాత చింటూ కార్పోరేషన్ కార్యాలయంపై నుంచి కిందకు వచ్చేటప్పుడు చేతిలోని రివాల్వర్ చూపిస్తూ అందరినీ పక్కకు వెళ్లాలని హెచ్చరించి గోడ దూకి పారిపోయినట్లు చెబుతున్నారు. గోడ దూకిన తర్వాత తర్వాత అతను జీడీ నెల్లూరు వైపు వెళ్లినట్లు పోలీసు విచారణలో తేలింది.
గోడ దూకిన సమయంలో చింటూ చేతిన నుంచి ఎయిర్ పిస్టల్ కింద పడిపోయింది. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ దొరకకపోవడంతో అది నిందితుడి వద్దనే ఉన్నట్లు పోలీసులు భావించారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న చింటూను విచారించిన పోలీసులు రివాల్వర్లను, కత్తులను జీడీనెల్లూరు వద్ద గల వంతెనపై నుంచి నీవానదిలో పడేసిట్లు గుర్తించారు.

వాటిని ఎక్కడ పడేశాడనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు చింటూను ఆ వంతెన వద్దకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. నిందితుడు చూపించిన ప్రాంతంలో అయస్తాంతం సాయంతో రెండు రివాల్వర్లను, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అవి నాటు తుపాకులని అంటున్నారు.
హత్య చేసిన సమయంలో కింద పడిన బుల్లెట్ కవచం విదేశాలకు చెందింది కావడంతో హత్యకు ఉపయోగించిన రివాల్వర్ కోసం నీవానది వద్ద పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రధాన నిందితుడు చింటూకు బెంగళూరులో ఆశ్రయం కల్పించాడనే ఆరోపణపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా శనివారం ఓ పోలీసు బృందం బెంగళూరు వెళ్లింది.












Click it and Unblock the Notifications