వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీష్ మూడోసారి: సర్వేలు తేలిపోయాయి, ఏం చెప్పాయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పలు సర్వేలు తమ తమ అంచనాలను విడుదల చేశాయి. అయితే, ఎక్కువ సర్వేలు తప్పయ్యాయని చెప్పవచ్చు. బీహార్ ఎన్నికల్లో మహా కూటమి... ఎన్డీయే కూటమి కంటే రెండింతల కన్నా ఎక్కువ స్థానాలను గెలుపొందింది.

ఎన్నికలకు ముందు పలు సర్వేలు.. మహాకూటమి, ఎన్డీయే కూటమి గెలుపుకు సమాన అవకాశాలున్నాయని, ఎవరు గెలిచినా ఎక్కువ తేడా ఉండదని తేల్చి చెప్పాయి. ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా హోరాహోరీ ఉంటుందని చెప్పాయి.

కొన్ని సర్వే ఫలితాలు.. ఎన్డీయే కూటమికి అనుకూలంగా, మరికొన్ని సర్వే ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా చెప్పాయి. అయితే, గెలుపొందే సీట్లలో పెద్ద తేడా ఉండదని సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ సర్వే ఫలితాలకు భిన్నంగా తాజా ఫలితాలు కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.

ఏ సర్వే ఏం చెప్పింది?

ఐదో అంచె ఓటింగ్ పూర్తయిన అనంతరం, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇలా ఉన్నాయి....

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే - జెడియూ నేతృత్వంలోని మహా కూటమికి 112 - 123 సీట్లు వస్తాయి. ఇండియా టుడే - సిసిరో సంస్తలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు ఆధిక్యం లభిస్తుందని తేలింది. ఎన్డీయేకు 120 స్థానాలు, మహా కూటమికి 117 స్థానాలు వస్తాయని ఆ సర్వే తేల్చింది.

మహా కూటమికి 122 సీట్లు, ఎన్డిఎకు 111 సీట్లు వస్తాయని, ఇతరులు 10 స్థానాలు గెలుచుకుంటారని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది. న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం - ఎన్డిఎకు 90 నుంచి 100 స్థానాలు వస్తాయి. మహా కూటమికి 130 నుంచి 140 స్థానాలు వస్తాయి. ఇతరులు 13 నుంచి 23 స్థానాలు గెలుచుకుంటారు.

టుడేస్ చాణక్య ఎన్డీయే కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహా కూటమికి వంద కంటే తక్కువ వస్తాయని చెప్పింది.

మరోవైపు, ఫలితాలకు ముందు రోజు కూడా జీ న్యూస్ సర్వే... బిజెపిదే అధికారం అని తేల్చి చెప్పింది. జీ న్యూస్ టీవీ ఛానల్ శనివారం వెల్లడించిన దాని ప్రకారం... ఎన్డీయే కూటమికి 138 సక్థానాలు, మహాకూటికి 102 స్థానాలు వస్తాయని చెప్పింది. సర్వే ఫలితాలు తప్పయ్యాయని చెప్పవచ్చు.

English summary
Bihar Elections 2015: Grand Alliance surges ahead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X