సోనియాపై బుక్: కాలం చెల్లినట్లేనా? అందుకే వివాదం
న్యూఢిల్లీ: స్పానిష్ రచయిత జేవియర్ మోరో రాసిన ది రెడ్ శారీ పుస్తకం వివాదాస్పదమైంది. ఈ పుస్తకాన్ని అతను 2004లో ప్రారంభించారు. 2010లో స్పానిష్‌లో విడుదల చేశారు. ఈ పుస్తకం పైన కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే, తన పుస్తకంలో రాజకీయపరమైన అంశాలు లేవని రచయిత జేవియర్ మోరో చెబుతున్నారు.
సోనియా గాంధీ బాల్యం, రాజీవ్ గాంధీతో ప్రేమలో పడటం, అత్తవారింట అనుభవాలు, భర్తను కోల్పోయినప్పుడు పడిన వేదన, ప్రధాని పదవిని తిరస్కరించడం వంటి పరిణామాలను రచయిత ఈ పుస్తకంలో వివరించారు.

2014 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో నెహ్రూ - గాంధీ కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లేనా అనే ప్రశ్నతో ఈ పుస్తకానికి ఆయన ఇచ్చిన ముగింపు వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్ తనను తాను మళ్లీ ఆవిష్కరించుకోవాల్సి ఉందని, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దీనిని చేయగలరా అని రచయిత ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం పొందవచ్చునని అభిప్రాయపడ్డారు. పుస్తకాన్ని నాటకీయంగా రాశానే గానీ ఎవరినీ కించపరచలేదని రచయిత జేవియర్ మోరో చెబుతున్నారు. ఈ పుస్తకంలో ఇటలీలోని ఒక మధ్యతరగతి మహిళ, భారత్‌కు చేరుకుని ప్రపంచంలో కొద్దిమంది శక్తిమంతులైన వారి జాబితాలో ఎలా చేరిందనేది వివరించానన్నారు.












Click it and Unblock the Notifications