• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిపై బిజెపి ట్విస్ట్: సీమాంధ్రకు న్యాయం, సవరణలు

By Srinivas
|

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనే ఆసక్తి అందిరలోను నెలకొంది. పార్లమెంటులో బిల్లు పెడితే పూర్తి మద్దతుంటుందని బిజెపి మొదటి నుండి చెప్పుకొంటూ వస్తోంది. అయితే, ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తన బ్లాగులో పేర్కొన్న అంశాలతో మరోసారి ఏమైనా మలుపులు తిరుగనుందా అనే చర్చ సాగుతోంది.

తెలంగాణ ఏర్పాటు కావాల్సిందే బిజెపి తన నిర్ణయంలో ఎలాంటి మార్పు చేసుకోలేదు అంటూ పదే పదే చెబుతూనే మరోపక్క సమన్యాయం పేరిట తెలంగాణ అంశానికి రెండు వైపులా బిజెపి పదును పెడుతోంది. శనివారం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకున్న తర్వాత మాట్లాడుతూ.. తెలంగాణకు తాము మద్దతిస్తామని చెబుతూనే మరోపక్క పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సవరణలు తెస్తుందని స్పష్టం చేశారు.

 BJP chides UPA for lax statecraft on Telangana

తాము సూచించే సవరణలను ఆమోదించేలా కాంగ్రెస్ మెడలు వంచుతామని, అవి ఆమోదం పొందుతాయనే నమ్మకం తమకుందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తమ సవరణలను ఆమోదించని పక్షంలో బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తుందని అన్యాపదేశంగా పేర్కొన్నారు.

ఇదే సమయంలో అరుణ్ జైట్లీ తన బ్లాగులో పేర్కొన్న అంశాలు పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. టి బిల్లుపై కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే వ్యూహం పదునుదేరుతోందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. జైట్లీ తన బ్లాగులో కాంగ్రెస్ రాజకీయ అసమర్థత కారణంగానే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ సాకారం కావడం లేదని, అత్యంత సున్నితమైన విభజనను పరిష్కరించటంలో కాంగ్రెస్ విఫలమైందని, టి బిల్లును విధాన సభ తిరస్కరించటంతో కొత్త వాతావరణం చోటు చేసుకుంటోందని, మంచి ఆలోచనతో మొదలైన రాష్ట్ర విభజన ప్రతిపాదనను సామరస్యంగా పరిష్కరించేందుకు ఇంకా వ్యవధి లేకపోలేదన్నారు.

అదే సమయంలో బిజెపి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు. అయితే, సీమాంధ్రకు విద్యుత్, నీటి పంపిణీ అంశాలతోపాటు కొత్త రాజధాని విషయంలో సరైన న్యాయం జరగాలని, తెలంగాణ ఆవిర్భావం నిజం అవుతుందన్న ఆశాభావం ఉందని జైట్లీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తమకెంత ముఖ్యమో, సీమాంధ్రకు న్యాయం జరగడమూ అంతే ముఖ్యమన్నది బిజెపి కొత్త వాదన. సీమాంధ్రకు న్యాయం జరగడం అంటే తెలంగాణకు అడ్డుపడటం కాదని ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

ఇఫ్‌లు.. బట్‌లకు... తావులేదని అయితే, అలా జరగకపోతే ఇలా జరిగితే అంటూ వేసే ప్రశ్నలకు పార్టీ బదులివ్వదని.. ముందు బిల్లు పార్లమెంటులోకి వస్తే తమ వైఖరి చెబుతామని వెంకయ్య పేర్కొన్నారు. ప్రధానంగా రాజధానిలో సీమాంధ్రుల భద్రత, ఉమ్మడి రాజధాని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో చేర్చడం, హైదరాబాద్‌కు ధీటుగా సీమాంధ్రలో రాజధాని అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పన, విద్యా- పరిశోధన సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా జలవనరుల పంపిణీ, ఇంధన అంశాలపై బిజెపి సవరణలను ప్రతిపాదించబోతోంది.

బిజెపి ప్రతిపాదించే సవరణలు ఆమోదించే స్థితిలో లేవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈక్రమంలో బిజెపి - కాంగ్రెస్ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ అంశంపై స్పష్టతను తీసుకురావడం ద్వారా రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను సొమ్ము చేసుకోవాలని బిజెపి తహతహలాడుతోంది. ఏకంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, లోక్‌సత్తా వంటి ప్రాంతీయ పార్టీలకు గట్టిపోటీ ఇచ్చి వాటికి ఎలాంటి ప్రజాబలం లేకుండా చూడటం ద్వారా తమ సత్తా చూపేందుకు తెలంగాణ అంశాన్ని ఆయుధంగా వాడుతోంది.

సీమాంధ్రలో పరిస్థితి తమకు అనుకూలంగా లేకున్నా, కనీసం తెలంగాణ ప్రాంతంలో తమకు అనుకూలంగా మలుచుకుని రెండు మూడు పార్లమెంటు స్థానాలను, కనీసం ఐదు నుండి 10 శాసనసభ స్థానాలు దక్కించుకోవాలని బిజెపి ఉవ్విళ్లూరుతోంది.
ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మొట్టమొదట లేవనెత్తింది తామేనని చెప్పుకోవడం ద్వారా ప్రజల్లో బిజెపి పలుకుబడి పెంచుకోవాలని, యుపిలో బలంగా ఉన్న ఎస్పీ, బిఎస్పీలు ఉత్తరాంచల్ విడిపోయాక బలహీనపడ్డాయనే వాదనను తెరమీదకు తెచ్చి జార్ఖండ్ ఏర్పడ్డాక జార్ఖండ్ ముక్తిమోర్చ పలుకుబడి తగ్గిందని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు.

తెరాస కాంగ్రెస్‌లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని, మరోపక్క టిడిపిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని బిజెపి నేతలు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ విలీనం కాకున్నా, తెలంగాణ తేవాల్సింది జాతీయ పార్టీలేననేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బిజెపి అగ్రనేతలు సూచిస్తున్నారు.

English summary
The UPA government has been unable to create the proposed State of Telangana and address the concerns of the people of the region and those of Seemandhra, the Bharatiya Janata Party said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X