పోలవరానికి మరో ఎదురుదెబ్బ: చిక్కుల్లో ట్రాన్స్‌ట్రాయ్

Posted By:
Subscribe to Oneindia Telugu
పోలవరానికి మరో ఎదురుదెబ్బ : జాతికి అంకితం చేసేంతవరకు నిద్రపోను

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గ్రావిటీ ద్వారా 2018 నాటికి నీరు అదించాలనే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌పై కెనరా బ్యాంక్ నేషనల్ కపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ సంస్థను దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పోరేట్ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కెనరా బ్యాంక్ కోరింది.

పోలవరం ప్రాజెక్టు భవితవ్యం కూడా...

పోలవరం ప్రాజెక్టు భవితవ్యం కూడా...

కెనరా బ్యాంక్ చర్య వల్ల ట్రాన్‌స్ట్రాయ్‌ భవిష్యత్యు మాత్రమే కాకుండా పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుకు కూడా ఎదురు దెబ్బ తగులుతుంద. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉందని, బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు వివరించింది.

ఇలా అయ్యే అవకాశం...

ఇలా అయ్యే అవకాశం...

కెనరా బ్యాంకు తరపున బ్యాంకు అధికారి పి కోటేశ్వరరావు ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. దీనిపై ట్రైబ్యునల్‌ త్వరలోనే ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఆ సంస్థకు రుణాలు లభించే అవకాశం ఉండదు. దానివల్ల పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ వంటి పనులు నడిచే అవకాశం లేదు.

చంద్రబాబు దాన్ని ముందే గ్రహించారా..

చంద్రబాబు దాన్ని ముందే గ్రహించారా..

ట్రాన్స్‌ట్రాయ్‌ని దివాలా సంస్థగా ప్రకటిస్తే 2019 నాటికైనా పూర్తయ్యే అవకాశాలు ఉండవు. పరిస్థితిని ముందే అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులకు టెండర్లు ఆహ్వానించారని, ఆ పనులను కొత్త సంస్థకు పనులు అప్పగించాలని అనుకున్నారని చెబుతున్నారు.

టెండర్ల ప్రక్రియకు బ్రేక్‌లు.

టెండర్ల ప్రక్రియకు బ్రేక్‌లు.

కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ట్రాన్స్‌ట్రాయ్ పరిస్థితిని వివరిస్తూ కొన్ని కీలకమైన పనులను వేరే సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు నితిన్ గడ్కరీని కోరారు. అయితే ట్రాన్‌స్ట్రాయ్‌కు మరో రెండు నెలలు గడువు ఇచ్చి చూద్దామని గడ్కరీ చెప్పినట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Canara Bank on Thursday filed a petition before National Company Law Tribunal, urging it to declare M/s Transstroy (India) Ltd as bankrupt.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి