కెసిఆర్‌ని తిట్టిన జగన్, బాబువి జల్సాలని లక్ష్మీపార్వతి
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం కడుతున్న రంగారెడ్డి - పాలమూరు, డిండి ప్రాజెక్టుల విషయమై వైసిపి అధినేత జగన్ సోమవారం కర్నూలులో మూడు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను హిట్లర్‌తో పోల్చుతూ నిప్పులు చెరిగిన జగన్.. చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు.
ఓ వైపు కేసీఆర్‌ను తిడుతూనే, మరోవైపు చంద్రబాబు నిలదీయడం లేదేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ను హిట్లర్ అని, అబద్దాలు చెప్పే వ్యక్తి అని, ఏపీ - తెలంగాణలను భారత్ - పాక్‌లా చేయవద్దని, కేసీఆర్ నిర్ణయంతో ఏపీని ఏడారి చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ తీరు వల్ల నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనని వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల పైన అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మంగళవారం రెండో రోజు కూడా దీక్ష కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి, ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు.

జగన్ దీక్ష
అనంతపురం జిల్లా నుంచి కర్నూలుకు వచ్చిన జగన్‌కు కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు సమీపంలోని అంబేద్కర్‌నగర్ వద్ద వైసిపి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదిక వద్దకు చేరుకున్న జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.

జగన్ దీక్ష
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలతో రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్నారు.

జగన్ దీక్ష
కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు అడిగే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని ఆనాడు బ్రహ్మంగారు చెప్పారని, నేడు అదే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.

జగన్ దీక్ష
దీక్ష వేదిక వద్ద వైసిపి నేత అనంత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు కడితే ఇక్కడ తాగునీరు దొరకని పరిస్థితి ఉంటుందన్నారు.

జగన్ దీక్ష
కర్నూలు ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాల్సిన బాధ్యతలను ప్రతిపక్షనేత జగన్ తీసుకొని తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ జలదీక్ష చేపట్టారన్నారు. రాయలసీమ ప్రజల గురించి సీఎం చంద్రబాబు ఆలోచించట్లేదన్నారు.

జగన్ దీక్ష
ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబునాయుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

జగన్ దీక్ష
జగన్ దీక్ష వద్దకు వచ్చిన ఆపార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనను కలిసేందుకు పోటీ పడ్డారు. ఆయనతో పలువురు సెల్ఫీలు దిగారు.

జగన్ దీక్ష
లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్పా డైరెక్ట్ రాజకీయాలు తెలియవని విమర్శించారు. ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి జగన్ అన్నారు.

జగన్ దీక్ష
లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. జగన్ ప్రజలతోనే ఉన్నారన్నారు. ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని తెలిపారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎలా కొనాలా అని లోకేష్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ దీక్ష
లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ... ఒక్క ప్రాజెక్టు కట్టని ఘన చరిత్ర చంద్రబాబుదని, ఆయనకు డైరెక్ట్ పాలిటిక్స్ చేతకాదన్నారు.

జగన్ దీక్ష
లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ... ప్రజల సొమ్ముతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడికెళ్లినా విమానాల్లోనే అన్నారు. నీచులతో కలిసి జగన్‌ను జైలుకు పంపారన్నారు. ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications