డీజిల్ చోరీ చేసి అతను కోట్లకు పడగలెత్తాడు
Recommended Video

హైదరాబాద్: ఇటీవల జరిగిన చెంగిచర్ల ప్రధాన రహదారి పక్కన ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనకు గల కారణం వెల్లడైంది. ఈ కేసులో నిందితులను మేడిపల్లి పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు.
ప్రధాన నిందితులు కులాల్ రాజు, జగదీష్ అన్నదమ్ములు. వారి నంచి పది ట్యాంకర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 7.49 లక్షల నగదును, రెండు ద్విచక్ర వాహనాలను, కార్లను, మడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషీ అందుకు సంబంధించిన వివరాలను అందించారు.

దక్షిణ భారతదేశంలో ఇదే పెద్దది
కొత్త సంవత్సరంలో దక్షిణ భారతందేశంలో జరిగిన సంఘటనల్లో చెంగిచర్ల వద్ద జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడు అతి పెద్దది. ఆయిల్ కంపెనీల ట్యాంకర్ల నుంచి పెట్రోల్, డీజిల్‌లను దొంగిలించి విక్రయించే వ్యక్తులే దానికి కారణం. పెట్రోల్‌ు ట్యాంకర్ల నుంచి దొంగలించే సమయంలో స్పార్క్ వచ్చి ఆ పేలుడు సంభవించింది. ఈ చోరీ వ్యవహారం గత పదేళ్ల నుంచి సాగుతోంది.

బతుకుదెరువు కోసం వచ్చి...
కర్ణాటక రాష్ట్రం చించోళి గ్రామానికి చెందిన కులాల్ బాబూరావు 40 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఆయన చెంగిచెర్లలోని ఐఓసి, హెచ్‌పిసిఎల్ కంపెనీల నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు, వారి డ్రైవర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. దాంతో పెట్రోల్, డీజిల్ దొంగతనంగా తీసి తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తూ వస్తున్నాడు.

తండ్రి బాటలోనే పుత్రులు..
ఈ క్రమంలో బాబూరావు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. అతనికి ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు కులాల్ రాజు (37) బోడుప్పల్ భీంరెడ్డి నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రెండో కుమారుడు కులాల్ జగదీష్ (34) చెంగిచర్ల ఆర్టీసి కాలనీలో ఉంటున్నాడు. తండ్రి చేసిన పనినే అన్నదమ్ములు ఇద్దరు ఎంచుకున్నారు.

ఇలా కొనుగోలు చేశారు...
మేడిపల్లి కమలానగర్ కాలనీల ఉన్న 800 గజాల స్థలంలో అన్నదమ్ములిద్దరు దానిలోని 400 గజాల స్థలంలో వెల్డింగ్ షాపు పెట్టారు ఐఓసి, హెచ్‌పిసిఎల్ నుంచి వ్చచే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులతో, డ్రైవర్లతో పరిచయాలు పెంచుకుని వాటి నుంచి తీసిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్లను తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తూ వస్తున్నారు.

ఆ రోజు ఇలా జరిగింది...
ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాకినాడలో పెట్రోల్ నింపుకున్న ట్యాంకర్ ఎస్ఆర్ నగర్‌కు వెళ్లి డెలివరీ చేయాల్సి ఉంది. అది చెంగిచర్లలో రాజు షెడ్డు వద్దకు వచ్ిచ ఆగింది. అక్కడ పెట్రోల్ తీస్తుండగా స్పార్క్ వచ్చి ప్రమాదం జరిింది. మేడిపల్లి రెవెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

వారి అరెస్టు, వీరు పరారీ..
పోలీసులు కులాల్ రాజు, కులాల్ జగదీష్‌లను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. కదీర్, షర్ఫుద్దీన్, నయీం, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

అతనికి భారీగా ఆస్తులు..
అక్రమ పెట్రోల్, డీజిల్ వ్యాపారంలో కులాల్ రాజు, కులాల్ జగదీష్ పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టారు. రాజు పేరు మీద 13 ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయని, వాటిని ఐఓసి, హెచ్‌పిసిఎల్ కంపెనీల్లో అద్దెకు పెట్టినట్లు తరుణ్ జోషీ చెప్పారు. ఘట్కేసర్‌లోనూ హైదరాబాదులోనూ పలు చోట్ల ప్లాట్స్ ఉన్నాయని, నగదు పెద్ద యెత్తున ఉందని చెప్పారుర. అతని అస్తి కోట్లలో ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications