వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20ఏళ్ల క్రితం అమెరికాలో మోడీ, కిషన్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 20ఏళ్ల క్రితమే అంటే 1994లోనే అమెరికాలో కాలుమోపారు. అప్పుడు కూడా ఆయన అమెరికా ఆహ్వానం మేరకే అక్కడ పర్యటించారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు ఆయన 1994లో అమెరికాలో పర్యటించారు. అనాటి మోడీ బృందంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నాయకులు పర్యటించారు.

అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో మోడీ కలియదిరిగారు. అమెరికా ఆర్థి వ్యవస్థ అంతబలంగా ఉండటానికి కారణాలను స్వయంగా విశ్లేషించుకున్నారు. అక్కడి స్పేస్ సెంటర్‌ను పరిశీలించి ఆ స్థాయికి భారతదేశం ఎదగాలంటే ఎంతకాలం పడుతుందని మథనపడ్డారు. అక్కడి యువకులతో మాట్లాడారు. విద్యా విధానం, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు నెలరోజులపాటు మోడీ అమెరికాలోనే గడిపారు.

ఈ పర్యటనను మోడీ సరదా పర్యటనగా భావించకుండా.. అసలు అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి కారణాలేంటి? భారత్ ఆ స్థానానికి రావాలంటే అనుసరించాల్సిన విధానాలేంటి? అన్న కోణంలో పరిశీలించడానికి ఆ పర్యటనను మోడీ వినియోగించున్నారు. 41రోజుల షెడ్యూల్‌లో మోడీ బృందం మొదట ఫ్రాన్స్‌లో పర్యటించిన అనంతరం ‘అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్' అధికారిక ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లింది. అప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండగా, కిషన్ రెడ్డి బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఢిల్లీలోని పార్టీ నివాసంలో వీరి గదులు కూడా పక్కపక్కనే ఉండేవి.

కాగా, ఆ పర్యటనకు బయలుదేరేముందు నరేంద్ర మోడీకి, కిషన్ రెడ్డికి గడ్డం ఉంది. వీరిని పర్యటనకు ఎంపిక చేసిన నాటి బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ ఇద్దరినీ పిలిచి గడ్డం తీసేసి నీట్ తయారు కావాలని ఆదేశించారు. దీంతో పర్యటనకు ముందురోజే ఇద్దరూ గడ్డం తీసేశారట. ఆ తర్వాత మళ్లీ గడ్డం లేకుండా మోడీ దర్శనం ఇవ్వలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, మళ్లీ అంటే 20ఏళ్ల తర్వాత భారత ప్రధానిగా మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన సెప్టెంబర్ 26న అమెరికాలో అడుగుపెట్టారు. ఆయన ఐదు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

భారత ప్రధాని నరేంద్ర మోడీ 20ఏళ్ల క్రితమే అంటే 1994లోనే అమెరికాలో కాలుమోపారు. అప్పుడు కూడా ఆయన అమెరికా ఆహ్వానం మేరకే అక్కడ పర్యటించారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

అప్పుడు కూడా నరేంద్ర మోడీ అమెరికా ఆహ్వానం మేరకే అక్కడ పర్యటించారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు ఆయన 1994లో అమెరికాలో పర్యటించారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

అనాటి మోడీ బృందంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నాయకులు పర్యటించారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో మోడీ కలియదిరిగారు. అమెరికా ఆర్థి వ్యవస్థ అంతబలంగా ఉండటానికి కారణాలను స్వయంగా విశ్లేషించుకున్నారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

అక్కడి స్పేస్ సెంటర్‌ను పరిశీలించి ఆ స్థాయికి భారతదేశం ఎదగాలంటే ఎంతకాలం పడుతుందని మథనపడ్డారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

అక్కడి యువకులతో మాట్లాడారు. విద్యా విధానం, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు నెలరోజులపాటు మోడీ అమెరికాలోనే గడిపారు.

యుఎస్‌లో మోడీ, కిషన్

యుఎస్‌లో మోడీ, కిషన్

ఈ పర్యటనను మోడీ సరదా పర్యటనగా భావించకుండా.. అసలు అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి కారణాలేంటి? భారత్ ఆ స్థానానికి రావాలంటే అనుసరించాల్సిన విధానాలేంటి? అన్న కోణంలో పరిశీలించడానికి ఆ పర్యటనను మోడీ వినియోగించున్నారు.

English summary
Twenty years ago Indian PM Narendra Modi and Telangana BJP President Kishan Reddy visited America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X