దొంగ చేతికే తాళాలు: నీరవ్ మోడీకి పాస్‌వర్డ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో తవ్వుతున్న కొద్దీ విషయాలు వెలుగు చూస్తున్నాయి. నీరవ్ మోడీ సిబ్బందికి అనధికారికంగా పాస్‌వర్డ్ ఇచ్చేశారు. దీంతో ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడానికి నీరవ్ మోడీకి అవకాశం చిక్కింది.
Recommended Video

అత్యంత కీలకమైన లాగన్ ఇన్‌ను, దాని పాస్‌వర్డ్‌ను నీరవ్ మోడీ సిబ్బందికి ఇచ్చేశారు. దాంతో నీరవ్ మోడీ కొద్ది నెలల్లోనే రూ.11,515 కోట్ల మేర దోచుకోవడానికి అవకాశం చిక్కింది.

ప్రధానంగా వీరు నిందితులు...
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్కు మనోజ్ కరత్ ప్రధాన నిందితులు. వీరిద్దరిని ఇప్పటికే అరెస్టు కస్టడీకి తరలించారు. నీరవ్ మోడీకి తాము సహకరించిన తీరుపై వారిద్దరు విచారణలో తెలియజేసినట్లు సమాచారం.

కమిషన్ తీసుకుని ఇలా చేశాం...
తాము కొంత కమిషన్ తీసుకుని స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ పైనాన్షియయల్ టెలీకమ్యూనికేషన్) సిస్టమ్ లాగిన్‌ను, పాస్‌వర్డ్‌ను ఇచ్చినట్లు వారు విచారణలో అంగీకరించారు. తద్వారా నీరవ్ మోడీ సిబ్బంది ఎలా దాన్ని ఆపరేట్ చేసి సొమ్మును కొల్లగొట్టారో వివరించారు.

నీరవ్ మోడీ సిబ్బంది ఇలా చేశారు..
తమ అకౌంట్ నెంబర్లు పాస్‌వర్డ్‌లు నీరవ్ మోడీ సంస్థకు చెందిన సిబ్బందికి ఇచ్చాని, వారు తమ అకౌంట్ల ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల మాదిరిగా లాగిన్ అయి, సిస్టమ్ యాక్సెస్ చేసుకున్నారని, వెరిఫైయర్/ అథరైజర్‌గా తమ తమ ఎల్ఓయులను క్లియర్ చేసుకుని స్విఫ్ట్ మెసేజ్‌లు పంపేవారని వారిద్దరు వివరించారు.

బ్యాంక్ లావాదేవీలన్నీ నీరవ్ చేతుల్లో..
పిఎన్బీ వ్యవస్థలోని అన్ని అకౌంట్ల పాస్‌వర్డ్‌లు, చివరకి బ్యాంకుకు చెందిన కర్ బ్యాంకింగ్ సిస్టమ్ కోడ్‌లు కూడా నీరవ్ మోడీ గ్యాంగ్ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం బ్యాంక్ లావాదేవీలన్నీ నీరవ్, అతని సిబ్బంది చేతుల మీదుగానే జరిగేవని చెప్పవచ్చు.

గోకుల్‌నాథ్ శెట్టీ కీలక పాత్ర...
మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి కుంభకోణానికి కేంద్ర బిందువుగా ారినట్లు చెబుతున్నారు. ఆయన నిరుడు మే 31వ తేదీన పదవీ విరమణ చేశాడు. దానికి మూడేళ్ల ముందు నుంచి నీరవ్ మోడీ వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications