బంగారు రుణాలు: కెసిఆర్‌తో బాబుకు చిక్కులు

హైదరాబాద్‌: బంగారం అప్పులను కూడా మాఫీ చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. రైతు రుణ మాఫీపై తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు వ్యక్తపరిచిన పలు రకాల అపోహలతో పాటు అనుమానాలను నివృత్తి చేశారు.

దాంతో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ బంగారు రుణాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. రైతులు బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి పంట రుణాలకు అప్పులు తీసుకున్న వాటిని సైతం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చకు ప్రయత్నించారు.

 Gold loans: KCR irks Chandrababu

పంటల కోసం రైతు లు అనేక మంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టారని విపక్షాలు ప్రభుత్వం దృష్టికి తేవడంతో వాటిని సైతం రద్దు చేసేందుకు తమ ప్ర భుత్వం సిద్ధంగా కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన మెనిఫెస్టోలో ఈ అంశం లేకపోయినా రైతులకు సంబం ధించినది కావడంతో కెసిఆర్ సానుకూలంగా స్పందించారు.

కెసిఆర్ హామీతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ చర్చకు బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న అప్పులపై చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. పైగా, తెలంగాణలో మాఫీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేయడం న్యాయమనే వాదన ముందుకు వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో రాష్ట్రం సతమతమవుతుంటే మరో వైపు రుణమాఫీలతోనే మరింత లోటుకు దారితీసే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతోంది. అయిదు ఫైళ్ళపై సంతకాలు చేసిన చంద్రబాబును ఇరకాటంలోకి కెసిఆర్ ఇరకాటంలోకి నెట్టినట్లేనని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+