ఏంచెప్పారో.. శెభాష్ కెసిఆర్: చూశాకే నమ్మిన గవర్నర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం చెప్పారో అదే ఇక్కడ చేసి చూపించారని గవర్నర్ నరసింహన్ మంగళవారం నాడు ప్రశంసలు కురిపించారు.
ఆయన హైదరాబాద్‌లోని ఐడీహెచ్‌కాలనీలో నిర్మిస్తున్న పక్కా గృహాలను మధ్యాహ్నం సందర్శించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో కలిసి ఇళ్లను పరిశీలించారు.
అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో సమావేశమైన సందర్భంగా ఇళ్ల పథకం చర్చకు వచ్చిందని, అప్పుడు ఆయన ఏం చెప్పారో అదే చేసి చూపించారన్నారు.

గవర్నర్ నరసింహన్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం చెప్పారో అదే ఇక్కడ చేసి చూపించారని గవర్నర్ నరసింహన్ మంగళవారం నాడు ప్రశంసలు కురిపించారు.

గవర్నర్ నరసింహన్
ఆయన హైదరాబాద్‌లోని ఐడీహెచ్‌కాలనీలో నిర్మిస్తున్న పక్కా గృహాలను మధ్యాహ్నం సందర్శించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో కలిసి ఇళ్లను పరిశీలించారు.

గవర్నర్ నరసింహన్
అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో సమావేశమైన సందర్భంగా ఇళ్ల పథకం చర్చకు వచ్చిందని, అప్పుడు ఆయన ఏం చెప్పారో అదే చేసి చూపించారన్నారు.

గవర్నర్ నరసింహన్
ఇటీవల తన వద్దకు వచ్చిన కెసిఆర్, సార్ పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ ఐడీహెచ్‌కాలనీలో పక్కా గృహాలను నిర్మిస్తున్నామని, అన్నీ పూర్తి కావొచ్చాయని, కొద్దిరోజుల్లో లబ్ధిదారులు వాటిలోకి వచ్చేస్తారని చెప్పాడని గవర్నర్ చెప్పారు.

గవర్నర్ నరసింహన్
అయితే, తాను మాత్రం.... చెప్పడం కాదు, నేను చూస్తేనే నమ్ముతానని కేసీఆర్‌తో చెప్పానని, రేపే వెళ్లి వాటిని చూడండని అన్నారని, ఆ మేరకు ఇక్కడకు వచ్చానని గవర్నర్ వివరించారు.

గవర్నర్ నరసింహన్
ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాగే అపార్టుమెంట్లు ఉంటాయని, ఇక్కడ ఇవి మరింత విలాసవంతంగా ఉన్నాయని గవర్నర్ కొనియాడారు.

గవర్నర్ నరసింహన్
ఇంత బాగా కట్టించిన ఇళ్లను సక్రమంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులదేనన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాక ఇటువైపు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌కు చెప్పానన్నారు.

గవర్నర్ నరసింహన్
ఇంత మంచి ఇళ్లు వచ్చాక లబ్ధిదారులు ఇంకా కష్టపడి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రభుత్వం ఇలాంటి గృహాలను నిర్మించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు.

గవర్నర్ నరసింహన్
మళ్లీ ఆరు నెలల తర్వాత ఇక్కడకు వచ్చి పరిస్థితి ఎలా ఉందో చూస్తానన్నారు. కాగా, కాలనీలో చేపట్టబోతున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని గవర్నర్‌కు వివరించారు.

గవర్నర్ నరసింహన్
గకవర్నర్ మంగళవారం బోయగూడలోని ఐడీహెచ్

గవర్నర్ నరసింహన్
ఢిల్లీలో ఐఏఎస్ ఆఫీసర్లకు కేటాయించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కంటే ఇవి బాగున్నాయని ప్రశంసించారు. ఐడీహెచ్ కాలనీలో జీహెచ్‌ఎంసీ అధికారులు పెత్తనం చేయరాదని, పర్యవేక్షణ మాత్రమే చేయాలని గవర్నర్ సూచించారు.












Click it and Unblock the Notifications