భారత టెక్కీలకు ఐసిస్ గాలం: వేతనం రూ.7లక్షలు
న్యూఢిల్లీ: సిరియా, ఇరాక్‌లతో పాటు ప్రపంచంలోని మిగతా దేశాల్లో నరమేథం సృష్టిస్తోన్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు ‘ఉద్యోగాల' పేరుతో భారత్‌లోని యువతకు గాలం వేస్తోందని 'మెయిల్ టుడే' లో ఓ వార్తా కథానాన్ని ప్రచురించింది.
ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని హ్యాక్‌చేసి దానిని తమకు చేరవేయగలిగే యువత కోసం ఐసిస్ ముమ్మరంగా అన్వేషిస్తోంది. ‘ట్విట్టర్', ‘ఫేస్‌బుక్' వంటి సోషల్ మీడియా ద్వారా ఐసిస్ నాయకులు ఇప్పటికే 30వేల మంది యువతతో సంప్రదింపులు జరుపుతున్నారని అందులో పేర్కొంది.

భారత్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాని అయినా హ్యాక్‌చేసి తమకు చేరవేసే వారికి భారీ మొత్తంలో 60 వేల డాలర్లు (దాదాపు రూ.7 లక్షలు) చొప్పున ‘వేతనం' చెల్లించేందుకు ఐసిస్ సిద్ధంగా ఉందని 'మెయిల్ టుడే' పత్రిక తన కథనంలో వెల్లడించింది.
భారత్‌లోకి తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఐసిస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిస్ ముఖ్య నాయకులు నిత్యం ఎంతో మంది హ్యాకర్లు ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని కిస్లే చౌదరి అనే సైబర్ క్రైం నిపుణుడిని ఉటంకిస్తూ ‘మెయిల్ టుడే' ఆ కథనంలో పేర్కొంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇటీవల మారణహోమం సృష్టించిన ఐసిస్ ఉగ్రవాదులు, ప్రస్తుతం భారత్‌లో దాడులకు వ్యూహాన్ని రూపొందించుకుంటోందని, దీనిలో భాగంగానే ప్రభుత్వ సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా ఇప్పటికే భారత్‌లోని 30 వేల మందికి పైగా యువ టెకీలతో సంప్రదింపులు జరిపిందని, వీరిలో కొంత మంది ఆ ఉద్యోగాల్లో చేరి ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications