Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శశికళకు షాక్: ఎంజీఆర్ జయంతి రోజే రంగంలోకి దీపా జయకుమార్, వారు జై కొడతారా?

జయలలిత మేనకోడలు దీపాకుమార్ అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజిఆర్ జయంతిని పురస్కరించుకొని జనవరి 17న, స్వంత పార్టీని ఏర్పాటుచేయనున్నారు.ఆమె రాజకీయాల్లోకి రావాలని జయ మద్దతుదారులు కోరుతున్నారు. ఈ తరుణంలో ఆమె

చెన్నై :తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్ శతజయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని తన రాజకీయ భవితవ్యంపై దీపాకుమార్ కీలకమైన ప్రకటన చేయనున్నారు. ఎంజిఆర్ , జయలలిత వారసత్వాన్ని కొనసాగించేందుకు వీలుగా పార్టీని ఏర్పాటును చేయనున్నట్టు ఆమె చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని దీపాను జయ మద్దతుదారులు కోరుతున్నారు.ఈ నేపథ్యంలో ఆమె పార్టీని ఏర్పాటుచేస్తానని ప్రకటించారు.

జయలలిత మరణంతో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు.ముఖ్యమంత్రి పదవిని కూడ చేపట్టాలని పార్టీ సీనియర్లు కొందరు ఆమెను కోరుతున్నారు. ఈ మేరకు ఆమె పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలను చేపట్టేందుకు వ్యూహరచన చేస్తోంది.

ఇదే తరుణంలో ఆమెకు పార్టీ నుండి స్వల్ప ప్రతిఘటనలు ఎదురౌతున్నాయి. శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టకూడదని ఓ ఎంఏల్ఏ రాజీనామా సమర్పించారు. చెన్నై నగర మాజీ మేయర్ సైదై దొరైస్వామి, తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పాండియన్ కూడా శశికళపై అసంతృప్తితో ఉన్నారు.

ఇదే తరుణంలో జయలలిత మేనకోడలు దీపాకుమార్ కు కూడ మద్దతు పెరుగుతున్నట్టు కన్పిస్తోంది.ఆమెను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.ఈ మేరకు ఆమె రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు.

 ఎంజిఆర్ జయంతి రోజు దీపాకుమార్ ప్రకటన

ఎంజిఆర్ జయంతి రోజు దీపాకుమార్ ప్రకటన

జయలలిత మరణంతో అన్నాడిఎంకె లో శశికళ కీలకంగా మారారు. అయితే ఆమెను పార్టీలో వ్యతిరేకిస్తోన్నవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. బహిరంగంగా ఆమెను ఇంతవరకు వ్యతిరేకించని నాయకులంతా ఒక్కరొక్కరు తమ అసంతృప్తి గళాన్ని విప్పుతున్నారు.ఇదిలా ఉంటే జయలలిత మేనకోడలు దీపాకుమార్ ను రాజకీయాల్లోకి రావాలని ఆమెను కోరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజు ఆమె ఇంటికి వచ్చి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.అయితే ఎంజిఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె వారసత్వాన్ని దీపాకుమార్ కొనసాగించనున్నారని కొందరు దీపాకుమార్ ను అభిమానించేవారు అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు దీపాకుమార్ కూడ రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె జనవరి 17వ, తేదిన ఎంజిఆర్ శతజయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ ఏర్పాటుకు సంబందించి ప్రకటన చేయనుంది.

 శశికళ వ్యతిరేకులు దీపాకు మద్దతిస్తారా ?

శశికళ వ్యతిరేకులు దీపాకు మద్దతిస్తారా ?

అన్నాడిఎంకె లో శశికళ వ్యతిరేకులు చేతులు కలుపుతున్నారు. చెన్నై మాజీ చైర్మెన్ సైదై దొరైస్వామి, తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పాండియన్ కూడా అసంతృప్తితో ఉన్నారు. వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి జయ సమాధి వద్ద నివాళులర్పించారు.అయితే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడ శశికళ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అయితే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారంతా దీపాకుమార్ కు మద్దతు పలుకుతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే దీపాకుమార్ కూడ పార్టీని ఏర్పాటుచేయాలని భావిస్తున్న తరుణంలో అన్నాడిఎంకె నుండి దూరంగా అసంతృప్త నాయకులు దీపాకుమార్ కు మద్దతు పలికితే కొంత ప్రయోజనం ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 జయ పోలికలు దీపాకుమార్ కు కలిసిరానున్నాయా ?

జయ పోలికలు దీపాకుమార్ కు కలిసిరానున్నాయా ?

జయలలిత మరణించిన తర్వాత ఆమె సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన జయ మేనకోడలు దీపాకుమార్ ను అమ్మ అభిమానులు చుట్టుముట్టారు. అచ్చు అమ్మ లాగానే ఉన్నారని చెప్పారు. ఆ రోజు నుండి ఆమె వార్తల్లో నిలిచారు. ప్రతి రోజు దీపాకుమార్ ఇంటికి వందలాదిమంది జయ అభిమానులు వచ్చి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ఆమె కూడ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమని ప్రకటించారు. అయితే దీపాకుమార్ కు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి పార్టీ నడపడం అంటే అంత సులువైన విషయం కాదు. అయితే జయ పోలికలు ఉండడం దీపాకుమార్ కు కలిసివచ్చే అంశం . అయితే రాజకీయాల్లో ఇదొక్కటే కలిసి రాదు. రాజకీయాల్లో రాణించాలంటే అన్ని రకాల వ్యూహలను, ఎత్తులను అనుసరించాల్సి ఉంటుంది.

 ద్రవిడ పార్టీల్లో రాజకీయ ఉద్దండులు దీపా తట్టుకొంటారా ?

ద్రవిడ పార్టీల్లో రాజకీయ ఉద్దండులు దీపా తట్టుకొంటారా ?

అన్నా డిఎంకె పార్టీలో ఇప్పటికే సీనియర్లు అనేక మంది పార్టీలో ఉన్నారు. శశికళ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే జయలలిత బతికున్నంత కాలం ఆమె వెన్నంటి ఉన్నారు. జయ తీసుకొన్న కొన్ని నిర్ణయాల్లో ఆమె కీలకంగా వ్యవహరించారని చెబుతుంటారు. అయితే దీపా రాజకీయాలకు అసలు కొత్త. డిఎంకె వ్యవహరాల్లో కరుణానిధి ఆయన తనయుడు స్టాలిన్ కూడ రాజకీయాల్లో ఉద్దండులు. అయితే దీపాకుమార్ రాజకీయాల్లోకి వస్తే కొత్త. ద్రవిడ రాజకీయాల్లో ఎక్కువగా సెంటిమెంట్ తో కూడుకొన్నవి.అయితే దీపాకుమార్ ఉద్దండ నేతలను తట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.అయితే అదే సమయంలో సెంటిమెంట్ పనిచేస్తే ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సెంటిమెంట్ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+