చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు షాక్ వరకు..: తమిళనాడులో మిడ్‌నైట్ డ్రామా

అన్నాడీఎంకేలో.. జయలలిత మృతి నుంచి టివివి దినకరన్ అరెస్ట్ వరకు అర్ధరాత్రి సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో జయలలిత మృతి చెందారు. ఆమె సాయంత్రం సమయంలోనే మృతి చెందారని, కానీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకేలో.. జయలలిత మృతి నుంచి టివివి దినకరన్ అరెస్ట్ వరకు అర్ధరాత్రి సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో జయలలిత మృతి చెందారు. ఆమె సాయంత్రం సమయంలోనే మృతి చెందారని, కానీ అర్ధరాత్రి ప్రకటన చేశారని అంటారు.

వణికిపోయి, ఏడ్చేసిన దినకరన్: ఢిల్లీ పోలీసుల తిప్పలువణికిపోయి, ఏడ్చేసిన దినకరన్: ఢిల్లీ పోలీసుల తిప్పలు

తాజాగా, ఈసీకి రూ.50 కోట్లకు పైగా లంచం ఇవ్వచూపిన కేసులో నాలుగు రోజుల పాటు విచారించిన ఢిల్లీ పోలీసులు ఆయనను రెండు రోజుల క్రితం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ మధ్యలో పన్నీరు సీఎం కావడం,ఇరువర్గాల మధ్య చర్చలు.. అంతా రహస్యంగా, రాత్రి జరుగుతున్నాయి.

జయలలిత మృతి

జయలలిత మృతి

2016 సెప్టెంబర్‌ 22వ తేది అర్ధరాత్రి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్‌ 5న రాత్రి 11 గంటల తర్వాత జయ మరణించారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

కలకలం రేపిన పన్నీరు ధ్యానం

కలకలం రేపిన పన్నీరు ధ్యానం

అదే రోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రిగా పన్నీరుసెల్వం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావించిన శశికళకు పన్నీర్‌సెల్వం షాకిచ్చారు. 2017 ఫిబ్రవరి 7వ తేది రాత్రి పొద్దుపోయిన తర్వాత మెరీనాతీరంలోని జయలలిత సమాధి వద్ద పన్నీరు అరగంట పాటు ధ్యానం చేయడం కలకలం రేపింది.

ఆ తర్వాత పన్నీరుసెల్వం, శశికళ వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలు ఆ రాత్రంతా కొనసాగాయి. అక్రమార్జన కేసులో శశికళ జైలుకు వెళ్లే ముందు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను నియమించారు.

ఉప ఎన్నిక వాయిదా ప్రకటన

ఉప ఎన్నిక వాయిదా ప్రకటన

జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారన్న కారణంతో ఈసీ వాయిదా వేసింది. ఓటర్లకు నగదును పంచారని పేర్కొంటూ ఏప్రిల్‌ 9వ తేదీన ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్టు పొద్దుపోయాక ఎన్నికల సంఘం ప్రకటించింది.

దినకరన్‌తో ఇబ్బందులు అని అర్ధరాత్రి విమర్శలు

దినకరన్‌తో ఇబ్బందులు అని అర్ధరాత్రి విమర్శలు

దినకరన్ వల్ల పార్టీకి ఇబ్బందులు తలెత్తాయని ఆయనకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 18న అర్ధరాత్రి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. ఆయనను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయించారు.

అర్ధరాత్రి సమన్లు

అర్ధరాత్రి సమన్లు

సుఖేష్ చంద్రశేఖర్ రూ.1.30 నగదుతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి జరిపిన విచారణలో, రెండాకుల గుర్తును పొందేందుకు రూ.50 కోట్లను ఎన్నికల అధికారులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి ఏప్రిల్‌ 19వ తేదీ అర్ధరాత్రి దినకరన్ ఇంటికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు ఆయనకు సమన్లు అందజేశారు.

అర్ధరాత్రి అరెస్ట్

అర్ధరాత్రి అరెస్ట్

రెండాకుల గుర్తును పొందేందుకు ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ ను నాలుగు రోజుల పాటు విచారించిన ఢిల్లీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తాజాగా, తెల్లారి చూసేసరికి అన్నాడీఎంకే కార్యాలయం వద్ద శశికళ పోస్టర్లు తీసేసి ఉన్నాయి.

English summary
AIADMK's TVV Dinakaran Arrested Close to Midnight, VK Sasikala's Posters Come Down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X