కెసిఆర్ ఢిల్లీ షో: కాంగ్రెస్‌తో పొత్తుకే (పిక్చర్స్)

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేయడం కన్నా పొత్తు పెట్టుకోవడమే శ్రేయస్కరమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్జీలకు ప్రయోజనం కలిగే విధంగా ఎంపి సీట్లు కాంగ్రెసుకు ఎక్కువగా కేటాయించి, శాసనసభా స్థానాలు తాను ఎక్కువ తీసుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటనలో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం మద్దతు కూడగట్టడంతో పాటు ఈ విషయంపై కూడా ఆయన కాంగ్రెసు పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

పార్లమెంటు ఉభయ సభల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్టు గతంలో ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు తన వ్యూహం మార్చుకున్నారు. 14 ఏళ్ల పాటు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నామని, ఏ విధమైన తెలంగాణను మనం ఆశించామో, ఆ విధంగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత తమపై ఉందని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్‌కు తెలంగాణకు చెందిన వివిధ వర్గాలు చెప్పిన అభిప్రాయం మేరకు పొత్తు కోసం మాత్రమే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

పార్టీని విలీనం చేస్తే తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెసు చేతిలో పెట్టినట్లు అవుతుందని, తెలంగాణ పునర్నిర్మాణం బాధ్యతను తెరాస తీసుకోవడమే మంచిదని తెలంగాణకు చెందిన వివిధ వర్గాలు కెసిఆర్‌పై ఒత్తిడి పెట్టినట్లు తెలుస్తోంది. రెండు పార్టీలకు ప్రయోజనం కలిగే విధంగా వ్యూహం ఉండాలని అంటున్నారు. కేంద్రంలో తిరిగి అధికారం రావాలనేది కాంగ్రెస్ లక్ష్యం, దానికి అసెంబ్లీ సీట్ల కన్నా పార్లమెంటు సీట్లు ముఖ్యం, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యమ సమయంలో ఏం చెప్పామో దానిని ఆచరణలో పెట్టడానికి పార్టీకి అవకాశం లభిస్తుందని తెరాస నాయకులు కూడా అంటున్నారు.

తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల అది తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగించినట్టు అవుతుందని, బలమైన ప్రత్యర్థిగా ఆ పార్టీ నిలుస్తుందని తెరాస నాయకులు అంటున్నారు. తెలుగుదేశం, బిజెపి మధ్య పొత్తు కుదిరితే తెలుగుదేశం ఎక్కువ శాసనసభా స్థానాలకు, బిజెపి ఎక్కువ పార్లమెంటు సీట్లకు పోటీ చేసే ఫార్ములాను అమలు చేస్తారని, ఇదే పద్ధతి తెరాస, కాంగ్రెసు కూడా అమలు చేస్తే బాగుంటుందని అంటున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో తీరిక లేకుండా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ధీమాతో ఆయన హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ కాంగ్రెసులో తెరాసను విలీనం చేయడం కన్నా కాంగ్రెసుతో ముందస్తు ఎన్నికల పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కెసిఆర్ ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ తన జట్టునంతా ఢిల్లీకి తీసుకుని వెళ్లారు. లాలూతో కెసిఆర్ మాట్లాడుతుంటే ఆయన జట్టు ఇలా తిలకిస్తూ కనిపించింది.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

ఎల్‌జెపి నేత రాం విలాస్ పాశ్వాన్‌తో తెరాస అధినేత కెసిఆర్ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

రాం విలాస్ పాశ్వాన్‌తో మంతనాల సమయంలో తన జట్టుతో కలిసి కెసిఆర్ ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.

కెసిఆర్ ఢిల్లీ షో

కెసిఆర్ ఢిల్లీ షో

జెడి (యు) నేత శరద్ యాదవ్‌ను కెసిఆర్ కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+