మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిద్దిపేట స్కీంలో ఎర్రన్నాయుడి పాత్ర: కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దివంగత తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడిపై ప్రశంసలు కురిపించారు. బుధవారం సిద్ధిపేటలో కెసిఆర్ పర్యటించిన సందర్భంగా తన మంత్రులందరికీ సిద్దిపేటలో తాగునీటి పథకం వెనుక దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడి కృషి ఉందని తెలిపారు.

1995లో చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో కేసీఆర్‌ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. అప్పుడు ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. పెద్ద పెద్ద మంచినీటి పథకాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు లేవు. అదే సమయంలో 1996లో కేంద్రంలో ఏర్పడిన దేవెగౌడ మంత్రివర్గంలో తెలుగుదేశం చేరింది.

ఎర్రన్నాయుడుకు కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ లభించింది. ఆ సమయంలో కేసీఆర్‌ సిద్దిపేట మంచినీటి పథకం కోసం ఒక ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారు చేయించి ఎర్రన్నాయుడుకు అందజేశారు. ఎర్రన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానిని మంజూరు చేయించారు.

ఆ పథకం సిద్ధిపేట నియోజకవర్గంలో కేసీఆర్‌ ప్రతిష్ఠను బాగా పెంచింది. ఈ విషయంలో ఎర్రన్నాయుడు తనకు చాలా సాయం చేశారని, ఆయన మేలు మరవలేనని అప్పట్లో కేసీఆర్‌ పార్టీ సహచరుల వద్ద కూడా అనేవారని చెబుతారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దివంగత తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడిపై ప్రశంసలు కురిపించారు.

కెసిఆర్

కెసిఆర్

బుధవారం సిద్ధిపేటలో కెసిఆర్ పర్యటించిన సందర్భంగా తన మంత్రులందరికీ సిద్దిపేటలో తాగునీటి పథకం వెనుక దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడి కృషి ఉందని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

1995లో చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో కేసీఆర్‌ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు.

కెసిఆర్

కెసిఆర్

అప్పుడు ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది.

కెసిఆర్

కెసిఆర్


పెద్ద పెద్ద మంచినీటి పథకాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు లేవు. అదే సమయంలో 1996లో కేంద్రంలో ఏర్పడిన దేవెగౌడ మంత్రివర్గంలో తెలుగుదేశం చేరింది.

కెసిఆర్

కెసిఆర్

ఎర్రన్నాయుడుకు కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ లభించింది. ఆ సమయంలో కేసీఆర్‌ సిద్దిపేట మంచినీటి పథకం కోసం ఒక ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారు చేయించి ఎర్రన్నాయుడుకు అందజేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఎర్రన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానిని మంజూరు చేయించారు. ఆ పథకం సిద్ధిపేట నియోజకవర్గంలో కేసీఆర్‌ ప్రతిష్ఠను బాగా పెంచింది.

కెసిఆర్

కెసిఆర్

ఈ విషయంలో ఎర్రన్నాయుడు తనకు చాలా సాయం చేశారని, ఆయన మేలు మరవలేనని అప్పట్లో కేసీఆర్‌ పార్టీ సహచరుల వద్ద కూడా అనేవారని చెబుతారు.

కెసిఆర్‌

కెసిఆర్‌

సిద్ధిపేట తాగునీటి ప్రాజెక్టు డిజైన్‌ను 90 శాతం తానే రూపొందించానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పదహారేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను రఫ్‌గా చేసిన డిజైన్‌కు ఇంజనీర్లు సాంకేతిక అంశాలు జోడించి ప్రాజెక్టును పూర్తిచేశారని సీఎం వివరించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Wednesday praised Late Telugudesam Party senior leader Errannaiudu for water scheme in Siddipet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X