కెసిఆర్ స్టైల్: దూకుడుగా అడుగులు వేస్తూ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నింపాదిగా అడుగులు వేస్తుంటే కెసిఆర్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రైతుల రుణమాఫీపై చంద్రబాబు రాబట్టే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కెసిఆర్ మిగతా విషయాల్లో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
రుణమాఫీకి రిజర్వ్ బ్యాంక్‌ను ఒప్పించడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం వంటి విషయాల్లో చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు కేంద్రం ఆర్థిక సాయం ఇస్తే తమకు కూడా ఇవ్వాలని కెసిఆర్ పట్టుబట్టే అవకాశం ఉంది. విదేశాలకు చెందిన ప్రతినిధులు ఇరువురు ముఖ్యమంత్రులనూ కలుస్తున్నారు.
కానీ, కెసిఆర్ పరిశ్రమలను రాబట్టడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. టాటా గ్రూప్ ఇప్పటికే విమాన విడిభాగాల పరిశ్రమను స్థాపించడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఆస్ట్రేలియా కంపెనీ ఒక్కటి పెల్లెట్స్ యూనిట్లను తెలంగాణ నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. హీరో హోండా కోసం స్థల పరిశీలన జరుగుతోంది. జపాన్ ప్రతినిధి బృందంతో కెసిఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఫలితాలు చూడాల్సి ఉంది.

కెసిఆర్‌తో శ్రీవాత్సవ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె శ్రీవాత్సవ సమావేశమయ్యారు.

పెండింగు ప్రాజెక్టులపై ఆరా
శ్రీవాత్సవ, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు.

జపాన్ ప్రతినిధి బృందంతో
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును జపాన్ ప్రతినిధి బృందం శుక్రవారం కలుసకుంది. పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు.

జపాన్ ఆసక్తి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి ప్రదర్శిస్తోందని, పారిశ్రామిక విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని కెసిఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications