వైసీపీ - టీడీపీ నుంచి జంపింగ్స్ : సైలెంట్ ఆపరేషన్..!?

పార్టీల నుంచి జింపింగ్స్ మొదలయ్యాయి. ప్రత్యర్ధి పార్టీలను ఢిఫెన్స్ లో పడేసే వ్యూహాలను పదును పెడుతున్నాయి.

ఏపీలో పార్టీలు ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీల నుంచి జింపింగ్స్ మొదలయ్యాయి. ప్రత్యర్ధి పార్టీలను ఢిఫెన్స్ లో పడేసే వ్యూహాలను పదును పెడుతున్నాయి. వైసీపీ - టీడీపీ కొత్త వ్యూహాలతో పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సైలెంట్ పొలిటికల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిస్తే..వైసీపీ నుంచి ఇద్దరు విభేధిస్తున్నారు. ఇక.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పుడు కొత్త రాజకీయం మొదలైంది. ఏం జరుగుతోంది.

ఎవరు ఎవరితో కలుస్తారు

ఎవరు ఎవరితో కలుస్తారు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఎన్నికల బరిలో టీడీపీ నిలిచింది. ఒక్కో అభ్యర్దికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వైసీపీ నుంచి ప్రస్తుతం ఉన్న సభ్యులతో పాటుగా టీడీపీ నుంచి మద్దతుగా ఉన్న నలుగురు సభ్యులు కలిసి రావటంతో ఏడుగురి ఎన్నిక సులువుగానే కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు ఆనం..కోటంరెడ్డి ఓట్ల పైన వైసీపీ ఆశలు పెట్టుకోవటం లేదు. వారిద్దరూ ఆత్మ ప్రభోదానుసారం ఓట్లు వేస్తామని వ్యాఖ్యానించటం ద్వారా..పరోక్షంగా టీడీపీకి సహకరిస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికల బరిలో టీడీపీ నిలిచింది. ఫలితం ఎలా ఉన్నా వైసీపీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టాలనేదే టీడీపీ వ్యూహం. దీనికి వైసీపీ కౌంటర్ స్ట్రాటసీ సిద్దం చేసుకుంది.

రెండు పార్టీల సైలెంట్ ఆపరేషన్

రెండు పార్టీల సైలెంట్ ఆపరేషన్


టీడీపీ ముఖ్య నేతలు వైసీపీ నుంచి తమతో కొందరు టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ప్రారంభించింది. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురిలో ఒకరు తిరిగి టీడీపీతో టచ్ లోకి వచ్చారంటూ ఆ పార్టీ మద్దతు మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వైసీపీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. టీడీపీలో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు వైసీపీ అభ్యర్ధులకే ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో..టీడీపీ బలం 19కి పరిమితం కానుంది. వైసీపీకి చెందిన ఇద్దరు మద్దతిచ్చినా 21కి చేరుతుంది. ఇంకా ఒక ఓటు అవసరం అవుతుంది. వైసీపీ బలా బలం సరిగ్గా 154 గా ఉంది. ఇదే సంఖ్య ఆ పార్టీకి ఏడు సీట్లు గెలవటానికి అవసరం. టీడీపీకి ఒక్క సీటు అవసరం కాగా.. వైసీపీకి ఏ ఒక్క ఓటు పోకుండా చూసుకోవటం అవసరం.

ఎన్నికల్లో కొత్త ట్విస్టులు ఉంటాయా

ఎన్నికల్లో కొత్త ట్విస్టులు ఉంటాయా


దీంతో..ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి నిమిషంలో ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయ అనే ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ ధీమాగా ఉంది. తాము పక్కా లెక్కతో వెళ్తున్నామని చెబుతోంది. 22న ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేసింది. తమ ఏడుగురు అభ్యర్దులు ఖచ్చితంగా గెలుస్తారని..తమ పార్టీ నుంచి ఎవరూ టీడీపీతో టచ్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇదే సమయంలో టీడీపీ కొత్త మైండ్ గేమ్ ప్రారంభించింది. తమ లెక్కలు తమకు ఉన్నాయంటూ ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో రెండు పార్టీల నుంచి రెబల్స్ పాత్ర కీలకంగా మారుతోంది. వైసీపీకీ దగగరైన నలుగురు.. టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల లెక్క పైన క్లారిటీ వచ్చేసింది. ఇక..ఉగాది వేళ.. రెండు పార్టీల్లో కొత్త రెబల్స్ టెన్షన్ మొదలైంది. ఈ లెక్కలకు 23 సాయంత్రం క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+