'భీమవరం హీరో': ఏపీలో కేటీఆర్ బర్త్ డే వేడుకలు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణలో పాలోయింగ్ బాగానే ఉంది. ఆదివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు.

కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఫ్లెక్సీలు వెలిశాయి. కేటీఆర్ స్నేహితుల పేరిట పట్టణంలో మూడు చోట్ల భారీ ఫ్లెక్సీలు ఆదివారం ఉదయం నాటికి వెలిశాయి.

Also Read: కేటీఆర్ బర్త్ డేకు పూలవర్షం: నీలాంటోళ్లు కావాలి.. మంచు లక్ష్మి

కల్వకుంట్ల తారక రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ, ఆయన ఫుల్ సూట్‌లో ఉన్న చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఓ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫోటోను కూడా ఉంచారు. దీంతో, ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో ఓ మారు, భీమవరంలో తనకు స్నేహితులు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటి రామారావు పుట్టిన రోజును తెరాస పార్టీ శ్రేణులు తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి.

కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి కెటిఆర్ పుట్టిన రోజును నిర్వహించడం గమనార్హం.

కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

తన పుట్టిన రోజుకు ఎక్కడా కటౌట్లు ఏర్పాటు చేయవద్దని, ఎక్కడన్నా కటౌట్లు ఉన్నా తొలగించాలని ముందుగానే మంత్రి ఆదేశించడంతో హైదరాబాద్‌లో కటౌట్లు కనిపించలేదు.

 కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

కానీ చిత్రంగా ఆంధ్రలో భీమవరం, రాజమండ్రి, కాకినాడ వంటి పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెటిఆర్ కటౌట్లు పెద్ద సంఖ్యలో కనిపించాయి.

 కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

గతంలో భీమవరం నుంచి పోటీ చేస్తాను అని మంత్రి కెటిఆర్ చమత్కరించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

 కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

ఆంధ్ర ప్రాంతంలో కెటిఆర్‌కు అనేక ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాటు చేయడం సామాజిక మాధ్యమాల్లో చర్చనియాంశంగా మారింది.

 కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

బేగంపేటలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన పుట్టిన రోజువేడుకల్లో కెటిఆర్‌కు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, కెటిఆర్‌లు చలోక్తులు విసురుకున్నారు. బీజేపీ శాసన సభ్యులు క్యాంపు కార్యాలయానికి వచ్చి కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్ పుట్టిన రోజు

కేటీఆర్ పుట్టిన రోజు

తెలంగాణ బీజేపీ శాసన సభ్యులు క్యాంపు కార్యాలయానికి వచ్చి మంత్రి కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister KTR's birthday celebrated in Andhra Pradesh

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి