ఇప్పటికీ కొన్ని బయటకు రాలేదు: సర్జికల్ స్ట్రయిక్స్‌పై పారికర్ ఆసక్తికర విషయాలు
న్యూఢిల్లీ: గత ఏడాది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ సంచలనం రేపాయి. దీనిపై గోవా ముఖ్యమంత్రి, నాటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మెరుపు దాడుల ప్రణాళికలు, వాటిని నిర్వహించిన తీరును సైన్యం అంత్యంత రహస్యంగా ఉంచినట్లు చెప్పారు. చివరికి ఆర్మీ వెల్లడించేంత వరకూ అవి బహిర్గతం కాలేదన్నారు. దాడులు నిర్వహించడానికి ముందు ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్లారని, సర్జికల్ స్ట్రైక్స్‌కు అవసరమైన వాటిని చివరి నిమిషంలో కొనుగోలు చేశారన్నారు.

ఇప్పటికీ కొన్ని విషయాలు బయటకు రాలేదు
సర్జికల్ స్ట్రయిక్స్‌కు సంబంధించిన ప్రణాళికలు, వాటిని అమలు పరిచిన తీరును సైన్యం అత్యంత రహస్యంగా ఉంచిందని పారికర్ చెప్పారు. కొన్ని విషయాలు ఇప్పటికీ బయటకు రాలేదని చెప్పారు. అధికారులు విదేశాలకు వెళ్లినప్పుడే దాడులు నిర్వహించేందుకు అవసరమైనవాటిని అప్పటికప్పుడే కొనుగోలు చేసి సైన్యానికి అందించారని, వారిని దాడులకు సిద్ధం చేశారని చెప్పారు.

రెండు వారాల్లో ప్రతీకారం తీర్చుకున్న భారత్
2016 సెప్టెంబర్ చివరివారంలో ఎల్వోసీని దాటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. యూరిలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 19 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న అనంతరం భారత్ రెండు వారాల్లోనే ఈ దాడుల రూపంలో ప్రతీకారం తీర్చుకుంది.

ఏ విషయం బయటకు పొక్కలేదు
యూరి ఉగ్రదాడులు, సర్జికల్ స్ట్రయిక్స్‌కు మధ్యలో ఆర్మీ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ అధికారులతో దాదాపు 18 సమావేశాలు నిర్వహించినట్లు మనోహర్ పారికర్ వెల్లడించారు. అయితే ఏ విషయం కూడా బయటకు పొక్కలేదన్నారు.

అనుకోనిది జరిగితే ఏ పరిణామాలు ఉంటాయో తెలుసు
ఆ సమయంలో తనకు నిద్ర కూడా పట్టలేదని, ఆ రకంగా తనపై ఒత్తిడి ఉండేదని మనోహర్ పారికర్ వెల్లడించారు. మెరుపు దాడుల విషయంలో ఏదైనా అనుకోనిది జరిగితే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని పేర్కొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications