మోడీ వన్ మ్యాన్ షో: చంద్రబాబుపై విముఖత?

సీమాంధ్రలో తన పర్యటన వన్ మ్యాన్ షోగా ఉండాలని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు మాత్రం మోడీతో వేదికను పంచుకోవడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. మోడీ పవనాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చంద్రబాబు మోడీతో కలిసి ప్రచార సభలో పాల్గొనాలని భావిస్తున్నారట.
నరేంద్ర మోడీ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ సభలు ఏప్రిల్ 20, మే 5 తేదీల మధ్య ఉంటాయని అంటున్నారు. ఉమ్మడి ప్రచారానికి చంద్రబాబు పట్టుబడుతుండడంతో బిజెపి నాయకులు తేదీలను ఖరారు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మోడీ ఒంటరిగానే ప్రచారం సాగిస్తున్నారు. సీమాంధ్రలో కూడా అలాగే ఉండాలని ఆయన భావిస్తున్నారు.
మోడీ, చంద్రబాబు కలిసి ప్రచారం సాగిస్తే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని టిడిపి నాయకులు అంటున్నారు. అయితే, తాము అయోమయంలో ఏమీ లేమని బిజెపి నాయకులు అంటున్నారు. పిఎంగా మోడీ, సిఎంగా నాయుడు అనే నినాదంతోనే తాము ప్రచారం సాగిస్తామని వారంటున్నారు.












Click it and Unblock the Notifications