వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మా నీకే: అదే టర్నింగని గేల్, 7వేల తొలి క్రికెటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: మోర్నీ మోర్కెల్ తన క్యాచ్‌లను విడిచిపెట్టడం మంచి టర్నింగ్ పాయింట్ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ అన్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌‍కు బెంగళూరు షాకిచ్చింది. ఈ సందర్భంగా గేల్ మాట్లాడారు. తనకు దక్కిన మేన్ ఆఫ్ ది మ్యాచ్ అమ్మకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు.

తన వ్యక్తిగత స్కోర్ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు మోర్నీ మోర్కెల్ తాను ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడం తనకు మంచి టర్నింగ్ పాయింట్ అని గేల్ అన్నాడు. అలాగే, తమ జట్టులోని మిగతా సభ్యులు, ముఖ్యంగా హర్షాల్ పటేల్‌కు గేల్ కితాబిచ్చాడు. కాగా, గేల్ 33, 63 వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన క్యాచులను మోర్నీ మోర్కెల్ పట్టలేకపోయాడు.

నరైన్ బౌలింగులో ఓ సిక్స్ కొట్టాలని తాను హర్షాల్ పటేల్‌కు సూచించానని గేల్ చెప్పాడు. ఆ సమయంలో హర్షాల్ పటేల్‌తో గేల్ మోకాళ్లపై కూర్చొని మాట్లాడటం అందరూ చూశారు. దీనిపై గేల్ మాట్లాడుతూ.. నరైన చివరి రెండు బంతుల్లో సిక్స్ కొట్టాలని సూచించానన్నాడు. తొలి బంతి మిస్ అయినా, తర్వాత బంతికి అతను సిక్స్ కొట్టాడన్నాడు.

Chris Gayle

తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తన తల్లికి డెడికేట్ చేస్తున్నట్లు గేల్ చెప్పాడు. శనివారం తన తల్లి పుట్టిన రోజు అన్నాడు. 'హ్యాపీ బర్త్ డే అమ్మ, అమ్మా నీవు చూస్తున్నావనుకుంటున్నా (టీవీ), నీకు శుభాకాంక్షలు చెబుతున్నా, ఈ మేన ఆఫ్ ది మ్యాచ్ నీదే' అని గేల్ అన్నాడు.

ఐపీఎల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ టి-20 ఫార్మెట్‌లో 7,000 పరుగుల మైలురాయిని చేరాడు. పొట్టి ఫార్మెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

English summary
Chris Gayle, who was awarded the man-of-the-match for his blistering 56-ball 96 against Kolkata Knight Riders in an Indian Premier League encounter here on Saturday, said one of the turning points of the match was when South African Morne Morkel dropped him on 33య
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X