టీ అమ్మిన మోడీ ఉద్వేగం, అక్కడ ముస్లీంలు లేరు
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను చాయ్ అమ్మిన రోజులను గుర్తు చేసుకున్నారు. మోడీ వారణాసీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన జ్ఞాపకాలను అతిథి గృహంలో ఉన్న సందర్శకుల పుస్తకంలో రాశారు. వారణాసీలోని డీజిల్ రైలు ఇంజిన్ వర్ర్స్‌కు చెందిన అతిథి గృహంలో ఆయన బస చేశారు. పరిసరాల్లోని వాతావరణం చూసి గతాన్ని గుర్తుకు నెమరు వేసుకున్నారు.
రైలింజన్ల చప్పుడు.. ప్లాట్ ఫారం పైకి రైళ్ల రాకపోకలు, ప్రయాణీకుల హడావుడి, రైలు బోగీల్లో సందడి.. ఇదంతా తన బాల్యాన్ని గుర్తు చేస్తోందని, నా చిన్నతనంలో ప్లాట్ ఫారం పైన టీలు అమ్మిన రోజులు కళ్లముందు మరోసారి సజీవంగా నిలుపుతోందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని వాద్ నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మడంలో మోడీ తన తండ్రికి నాన్నకు సాయం చేసిన విషయం తెలిసిందే. వాణాసీలో ఉద్వేగానికి లోనైన మోడీ ఈ ప్రాంతానికి మళ్లీ మళ్లీ వస్తానని ఉద్వేగానికి లోనయ్యారు.
ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసి పరిధిలో మోడీ సుక్రవారం దత్తత తీసుకున్న జయపూర్ గ్రామంలో ఒక్క ముస్లిం కూడా నివసించడం లేదు. దీనిని 2006లోనే ఆరెస్సెస్ దత్తత తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. జయపూర్‌లో కుర్మీ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు.

సాధారణంగా వీరు అప్నాదళ్‌కు మద్దతు పలుకుతుంటారు. మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఏకైక మిత్రపక్షం ఈ పార్టీయే. కాగా, గ్రామంలో ఒక్క ముస్లీం లేకపోవడం యాధృచ్ఛికమేనని, ప్రధాని లోకసభ ఎన్నికల ప్రచార సమయం నుండే జయపూర్‌తో అనుబంధఝాన్ని పెంచుకున్నారని బీజేపీ చెబుతోంది.
6 రోజుల్లో 60 లక్షలు దాటిన బీజేపీ సభ్యత్వం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరందుకుంది. గత శనివారం మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం తొలి వారం రోజుల్లోనే 60 లక్షల మందికి పైగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్టు బీజేపీ వర్గాలు చెప్పాయి. వీరిలో 20 లక్షల మంది తొలి 24 గంటల్లోనే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి 10 కోట్ల మందిని చేర్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డీజిటల్ మీడియా, మిస్డ్ కాల్స్ ద్వారా పార్టీ సభ్యత్వాలు చేపట్టాలని మొదట్లో భావించారు. ఇపుడు ప్రజలను నేరుగా కలవడం ద్వారా కూడా సభ్యత్వ నమోదును ఉధృతం చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications