నయీం సామ్రాజ్యం: మాజీ మావోలు, సుపారీ గ్యాంగ్

హైదరాబాద్: సమాజాన్ని గడగడలాడించిన నయీం తనదైన నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. అతని వద్ద దాదాపు 260 మంది పనిచేసేవారు. వారిలో 48 మంది మాజీ మావోయిస్టులు, 38 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులు ఉండేవారని సమాచారం. 110 మంది ఇన్‌ఫార్మర్లు, ఎనిమిది మంది డ్రైవర్లు, తన 20 ఇండ్లల్లో పనిచేసేందుకు 15 మంది (వాచ్‌మెన్‌లు, ఇంటి పనులు చేసేవారు) ఉండేవారట.

ఐదుగురు టెక్నికల్ సపోర్టర్లు, ఇన్‌ఫార్మర్లపై నిఘా, సమాచారం కోసం 10 మంది, 26 మంది కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా ప్రతీరోజు నయీం, అతడి ముఠా సభ్యుల కనుసైగల్లో పనిచేస్తుంటారని, జీతాలు రూ.10వేల నుంచి మొదలై, వారి పనులను బట్టి ఉంటాయని పోలీసులు గుర్తించారు. తాను సూచించిన పనులను సూచించిన విధంగా పూర్తిచేసినవారికి నయీం ప్రత్యేకంగా నజరానాలు కూడా ఇచ్చాడని తెలిసింది.

తనవద్ద పనిచేసేవారి కుటుంబాల్లో వివిధ కార్యక్రమాలకు బియ్యం, పప్పు దినుసులు ఇచ్చేవాడని, తన తరపున నేరాలు చేసి జైలుకు వెళ్ళినవారి కుటుంబాల అవసరాలను తీర్చేవాడని పోలీసులు అరెస్టు చేసిన పలువురు వెల్లడించినట్టు తెలుస్తోంది. నయీం కంపెనీలో పనిచేసిన ఉద్యోగులపై పోలీసులు నిఘా పెట్టారు. వారి కదలికలను గమనిస్తున్నారు.

మూడు జిల్లాలతో రెవెన్యూ డివిజన్

మూడు జిల్లాలతో రెవెన్యూ డివిజన్

నక్సలైట్ల అణచివేతలో సహకరించినందుకు అందిన అధికార, రాజకీయ ఆశీస్సులతో ఏకంగా మూడు జిల్లాల పరిధిలో తన రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అక్రమ భూ లావాదేవీలు, స్వాధీనాలు సరేసరి. ఏకంగా ఎన్ కంపెనీ పేరుతో మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పుకొన్నాడు. వ్యాపారులకు ట్యాక్స్ నిర్దేశించాడని చెబుతున్నారు.

వసూళ్లు ఇలా...

వసూళ్లు ఇలా...

మైనింగ్, ఇసుక వ్యాపారుల నుంచి నయీం పన్ను వసూలు చేశాడు. పెట్రోల్ బంకులు, రైసు మిల్లులు అతను నిర్దేశించిన డబ్బులు చెల్లించాల్సిందే. వీటితోపాటు భారీ టర్నోవర్‌లు ఉండే కొన్ని వ్యాపారాల యజమానులనూ నియంత్రించాడు. ఈ రకంగా ప్రతి నెలా 5 కోట్ల రూపాయల వరకు రాబడి వచ్చేదని తెలుస్తోంది.

ప్రత్యేక సత్కారాలు

ప్రత్యేక సత్కారాలు

తన సామ్రాజ్యం ఇంతలా వర్ధిల్లడానికి తోడ్పడేవారిని సముచితంగా సత్కరించేవాడు. భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్ల శాఖలో తమరెలా అంటే అలానే అని వినయంగా పనిచేసిపెట్టే అధికారులకు భూరి నజరానాలు అందించేవాడు. అలాంటివారు ఏకంగా 165 మంది ఉన్నట్లు రికార్డులు రాసి పెట్టాడు.

న్యాయనిపుణులు కూడా..

న్యాయనిపుణులు కూడా..

కబ్జా స్థలాలు తన సొంతం కావడానికి చట్టపరమైన లొసుగులను గుర్తించి తగిన సలహాలిచ్చేవారికి ప్రతిఫలం ముట్టజెప్పేవాడు. అన్నింటికీ తెగించి తాను చేసే ఆదేశాలను తూచా తప్పకుండా అమలుచేసే అనుచరుల కుటుంబాల మనుగడకూ అంతే పకడ్బందీ ఏర్పాట్లు చేశాడు.

నెలనెలా జీతాలు...

నెలనెలా జీతాలు...

తన వద్ద పనిచేసేవారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వారికి నెలనెలా ఠంచనుగా మూడోతేదీకల్లా బ్యాంకుల నుంచి వేతనాలు అందేవి. ఆ విధంగా తన కంపెనీలో పని చేసే మొత్తం 260 మందికి జీతాలిచ్చేవాడు. చేసే పనులు ఎలాంటివైనా ఒక సంస్థాగత నిర్మాణం, నిర్వహణ నయీం ప్రత్యేక శైలి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది.

అంతా పద్ధతి ప్రకారం...

అంతా పద్ధతి ప్రకారం...

డైరీలో అన్నీ రికార్డు చేయడం, పన్నుల వసూళ్లు, ఆదాయ వ్యయాలు దాపరికం లేకుండా రాసి పెట్టడం వంటివి నయీం పద్ధతి ప్రకారం చేసేవాడని అంటున్నారు.

మూడో తేదీకల్లా జీతాలు..

మూడో తేదీకల్లా జీతాలు..



ఒకే బ్యాంక్ ఖాతానుంచి ఇంతమొత్తంలో చెల్లింపులు చేస్తే ఐటీ శాఖ అనుమానిస్తుందని భావించిన నయీం అందుకూ ఓ వ్యూహాన్ని అనుసరించాడు. ఒక్కో బ్యాంక్ ఖాతా నుంచి ముగ్గురికి జీతాలు చెల్లించాడు. మూడో తేదీ కల్లా అందరికీ జీతాలు వెళ్లేవి.

ఒక్క నల్లగొండ జిల్లాలోనే..

ఒక్క నల్లగొండ జిల్లాలోనే..

ఒక్క నల్లగొండ జిల్లాలోనే వందమందికిపైగా ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకొని పెంచి పోషించాడని పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+