జగన్ ఆశలు: టి నాయకులతో కీలక వ్యాఖ్యలు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయనే ఆశతో ఉన్నారట. తనను కలిసిన వారితో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశముందని వ్యాఖ్యానిస్తున్నారట. అదే సమయంలో అలా జరిగినా జరగకపోయినా పార్టీ సమైక్య నినాదం తీసుకుందని, అదే దారిలో నడవాలని చెబుతున్నారట. మరో విషయమేమంటే తెలంగాణ ప్రాంత నేతలకు కూడా జగన్ ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
పార్టీకి చెందిన పలువురు తెలంగాణ నేతలు జగన్‌ను కలుస్తున్నారు. ఈ సమయంలో ఆయన వారితో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారట. పార్టీ సమైక్య నినాదం తీసుకుందని కాబట్టి ఎవరు ప్రత్యేక తెలంగాణ అనవద్దని, దానివల్ల సీమాంధ్రలో పార్టీలో ఇబ్బందులు రావొచ్చునని చెబుతున్నారట!
తెలంగాణ ప్రభావం బలంగా ఉండని తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలపై, నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారిస్తున్నారట. విభజన జరిగే అవకాశం లేదని చెబుతున్న జగన్... ఏం జరిగినా తెలంగాణ ప్రాంతంలోను పట్టు సాధించే దిశలో వెళ్తున్నారంటున్నారు. అందుకే ప్రత్యేక వాదం లేని జిల్లాలపై దృష్టి పెట్టారంటున్నారు.












Click it and Unblock the Notifications