వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ 'యువరాజ్యం'తో వస్తారా, పక్కా అజెండాతో?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. మార్చి రెండో వారంలో పవన్ మాట్లాడుతారనే ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివిధ రకాల ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. పవన్ పార్టీ పెడతారా? అన్నయ్య చిరంజీవితోనే ఉంటానని ప్రకటిస్తారా? పార్టీ పెడితే ఎవరితో కలుస్తారు? పార్టీ పెట్టకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే అభ్యర్థులకు అండగా నిలబడతారా? ఇది ఇప్పుడు అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తోంది.

Pawan Kalyan: not power hungry

యువరాజ్యంతో ముందుకు వస్తారా?

సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ కోసం పవన్ బాగా ప్రచారం చేశారు. యువతను ఆకట్టుకునేందుకు ప్రజారాజ్యం వింగ్‌గా యువరాజ్యాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. యువరాజ్యం కోసం పవన్ తీవ్రంగా పని చేశారు. పిఆర్పీని చిరు కాంగ్రెసులో కలిపేసిన తర్వాత అసంతృప్తికి లోనైన పవన్ దూరంగా ఉన్నారు. యువరాజ్యం పేరుతో పవన్ పిఆర్పీ వింగ్‌ను చూసుకున్నందువల్ల పవన్‌కు రాజకీయాలు కొత్త కాదనే చెప్పవచ్చు. ఇప్పుడు అదే యువరాజ్యం పేరుతో వస్తారా అనే చర్చ సాగుతోంది.

అధికారం కాదు... సేవ

పవన్ కల్యాణ్ ఒకవేళ పార్టీని స్థాపించిన అధికారం కోసమో లేక మంత్రి పదవుల కోసమే కాదంటున్నారు. పవన్‌ను దగ్గరి నుండి చూసిన వారెవరికైనా ఆయన సేవాభావం తెలిసిపోతుందంటున్నారు. పవన్ పార్టీ పెట్టినా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అంటున్నారు. పార్టీ పెట్టకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తారని అంటున్నారు. పవన్ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి పలు అజెండాతో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్తారింటికి దారేది విజయోత్సవ వేడుక సందర్భంలో పవన్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు.

చిత్ర పరిశ్రమ వారు పైరసీ గురించి నిత్యం మాట్లాడుతుంటారు. అయితే, పవన్ అత్తారింటికి దారేది వేడుకలో మాట్లాడుతూ... పైరసీ అనేది చాలా చిన్న సమస్య అని, సమాజంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని, వాటి పైన పోరాడాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయ పార్టీ స్థాపించకున్నా ప్రజలకు కచ్చితంగా సేవ చేస్తారని భావించే పలువురు అభ్యర్థులకు పవన్ వ్యక్తిగతంగా మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

English summary
Even since news broke that Pawan Kalyan has political aspirations, Tollywood is busy gossiping about whether he will be able to outshine his Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X