Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ నివేదిక: బిజెపికి షాక్, చంద్రబాబుకు ఖుషీ

Recommended Video

    Pawan Kalyan's JFC Final Report On Centre's Aid To AP

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జెఎఫ్‌సి ఊరటనిచ్చే అవకాశం ఉంది. సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జెఎఫ్‌సి) కేంద్రం రాష్ట్రానికి అందించిన సాయంపై నివేదికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

    ఎంతో సాయం చేశామని కేంద్రం చెబుతుండా, చేయాల్సినంత చేయలేనది రాష్ట్రం అంటోంది, ఇందులో వాస్తవమేమిటో తేలుస్తామని జెఎఫ్‌సి చెప్పి అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించింది. తుది మెరుగులు దిద్ది నివేదికను శనివారంనాడు విడుదల చేసే అవకాశం ఉంది.

    కేంద్రం చేసింది ఏమీ లేదని...

    కేంద్రం చేసింది ఏమీ లేదని...

    విభజన తర్వాత సమస్యల నుంచి రాష్ట్రం బయటపడడానికి కేంద్రం ప్రత్యేకంగా అందించిన సాయం ఏమీ లేదని పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్‌సి తేల్చినట్లు సమాచారం. విభజన చట్టంలోని హామీలను రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన ప్రత్యేక హోదా కల్పన వంటివి ఏవీ సక్రమంగా అమలు కాలేదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

    ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా...

    ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా...

    చివరకు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రానికి తగిన సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ కూడా సక్రమంగా అమలు కాలేదని జెఎఫ్‌సి అభిప్రాయపడినట్లు సమాచారం.

    ఆ లెక్కలపై ఇలా....

    ఆ లెక్కలపై ఇలా....

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలపై కమిటీ సభ్యులు పద్మనాభయ్య, జయప్రకాష్ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, తోట చంద్రశేఖర్ లోతైన విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నివేదికను రూపొందించారు. దానిపై గురువారనాడు పవన్ కల్యాణ్‌తో చర్చించారు

    పేరాల వారీగా పరిశీలన

    పేరాల వారీగా పరిశీలన


    విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పేరావారీగా కమిటీ సభ్యులు పరిశీలించారు. ఏ పేరా కింద ఏ అంశాలను పొందుపరిచారు, వాటి అమలుకు ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనే విషయాలను పరిశీలించి, లెక్కలను మదింపు చేసినట్లు తెలస్తోంది. ఆయా పద్దుల కింద రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ విధమైన సాయం చేయలేదని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

    ఉదారత చూపలేదు..

    ఉదారత చూపలేదు..

    ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి నిధుల విషయంలో రాష్ట్రం పట్ల ఏ విధమైన ఉదారత కూడా కేంద్ర ప్రదర్శించలేదని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలతో కూడిన సమాచారాన్ని కమిటీ సభ్యులు పవన్ కల్యాణ్కు అందించారు.

    బిజెపికి షాక్, చంద్రబాబుకు ఊరట

    బిజెపికి షాక్, చంద్రబాబుకు ఊరట

    పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్‌సి ప్రజల ముందు పెట్టే నివేదక బిజెపికి షాక్ ఇస్తుందని, చంద్రబాబుకు ఊరటనిస్తుందని అంటున్నారు. ఆ నివేదిక చంద్రబాబు వాదనకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+