పవన్.. ఎందుకీ రుసరుస?: దానిపై సూటిగా సమాధానం చెప్పలేకనే..

Subscribe to Oneindia Telugu

అమరావతి: క్రియాశీలక రాజకీయాల్లో దాటవేత ధోరణి అంత మంచిది కాదు. విషయమేదైనా తమ స్టాండ్ ఏంటనేది ప్రజలకు సూటిగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలా కాకుండా.. అడిగిన ప్రశ్న ఒకటైతే, ఇంకేదో సమాధానం చెప్పడం.. కేవలం దాటవేత ధోరణే అన్న విమర్శలకు దారితీస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలోనూ ఇప్పుడిదే జరిగింది.

సినిమా ముందుంది కదా.. ట్రైలర్ ఎందుకు?, ఆరోజే అన్నీ: పవన్

 సూటిగా సమాధానం చెప్పలేదు..:

సూటిగా సమాధానం చెప్పలేదు..:

అమరావతిలో తన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. కానీ మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు.. ఆయన నుంచి సూటిగా సమాధానం రాలేదు.

సరే, జనసేన భవిష్యత్తు కార్యాచరణ గురించి మార్చి 14న ప్రకటిస్తానన్నారు కాబట్టి దాని గురించి చెప్పలేదు అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలపై ఆయన చెప్పిన సమాధానాలు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదంటున్నారు.

టీడీపీతో జనసేన సంబంధం?:

టీడీపీతో జనసేన సంబంధం?:

సీఎం చంద్రబాబును ఆపదలో ఆదుకోవడానికి పవన్ బయటకొస్తుంటాడు అన్న విమర్శ ఆయనపై ఉంది. అయితే పవన్ మాత్రం ఏ పార్టీకి కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు.. టీడీపీతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పవన్ చెప్పిన సమాధానం ఏమాత్రం పస లేనిదిగా ఉందంటున్నారు.

 నాపై రుద్దకండి..: పవన్

నాపై రుద్దకండి..: పవన్

'నేను ఎలా ఆలోచిస్తున్నానో ఎందుకు బయటకు చెప్పాలి. ప్రజా జీవితంలోకి వచ్చామన్నది నిజమే. కానీ అన్ని ఆలోచనలు బయటకు చెప్పం కదా. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతాను. మీ (మీడియా) ఆలోచన విధానాన్ని నాపై రుద్దడానికి ప్రయత్నించవద్దు' అంటూ పవన్ బదులిచ్చారు.

 పవన్ కామెంట్‌పై భిన్నాభిప్రాయాలు..:

పవన్ కామెంట్‌పై భిన్నాభిప్రాయాలు..:

పవన్ సమాధానం విన్న తర్వాత కొంతమంది టీడీపీతో ఆయన సంబంధాలు నిజమే అనుకుంటున్నారు. నేరుగా సమాధానం చెప్పలేకనే అభిప్రాయాలను రుద్దవద్దంటూ రుసరుసలాడారని విమర్శిస్తున్నారు.

మరికొంతమంది మాత్రం.. నిజమే, ప్రతీ విషయాన్ని బయటకు చెప్పాల్సిన అవసరమేముంది?, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు మారుతుంటాయి కదా అంటున్నారు.

మార్చి 14న సభ:

మార్చి 14న సభ:

జనసేన ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించబోతున్నారు. మార్చి 14న నిర్వహించే ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్ తన రాజకీయ వైఖరిని మరింత స్పష్టంగా చాటాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదా, వ్యక్తిగత ఆస్తులు, ఏపీలో రాజకీయ సమీకరణాలు ఇలా అన్నింటిపై ఆరోజే మాట్లాడుతానని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena President Pawan Kalyan skips somany questions from media, Pawan said he will address all the things on March 14, on the eve of Janasena party meeting

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి