వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసరత్తు, భేటీలు: చంద్రబాబు బిజీ బిజీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారంనాడు బిజీగా గడిపారు. వివిధ కార్యక్రమాలపై ఆయన కసరత్తు చేశారు. సాధారణ పరిపాలనపై ఆయన సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేశారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కలుసుకున్నారు. గత కాంగ్రెసు పాలనపై ఆయన దుమ్మెత్తిపోశారు.

సుపరిపాలన అందించడానికి ఏ విధంగా పనిచేయాలో, తాను ఏ విధంగా పనిచేస్తానో వివరించారు. సుపరిపాలన రావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకువస్తాం. పరిపాలన అంటే ఎలా ఉండాలో వంద రోజుల్లో చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారు.

కాంగ్రెసు పాలన కారణంగా దక్షిణ భారతదేశంలోని అన్ని రాషా్ట్రలతో పోల్చి చూస్తే ఆరోగ్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడి ఉందన్నారు. 1991-2011లో 17 శాతంతో మెరుగ్గా ఉన్న అక్షరాస్యత శాతం కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో 7 శాతానికి పడిపోయిందన్నారు. ప్రాథమిక విద్య కుప్పకూలిపోయిందని వివరించారు.

బెల్ ప్రతినిధులతో భేటీ

బెల్ ప్రతినిధులతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారంనాడు బెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో వారి ప్రాజెక్టు గురించి ఆయన విన్నారు.

వృద్ధులతో భేటీ..

వృద్ధులతో భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహంలో వయోజనులను కలిసి వారి విన్నపాలను విన్నారు.

వర్క్‌షాప్‌లో ఇలా..

వర్క్‌షాప్‌లో ఇలా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారంనాడు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల వర్క్‌షాప్‌లో ప్రసంగించారు. వారికి మార్గదర్శనం చేశారు.

మున్సిపాలిటీల అభివృద్ధి

మున్సిపాలిటీల అభివృద్ధి

మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని నారా చంద్రబాబు నాయుడు వర్క్‌షాప్‌లో చెప్పారు.

శ్వేతపత్రం విడుదల

శ్వేతపత్రం విడుదల

సాధారణ పరిపాలనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేశారు.

ప్రతాప్ సి రెడ్డి భేటీ

ప్రతాప్ సి రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి భేటీ అయ్యారు.

టాటా ఎస్ఐఎ ఎయిర్‌లైన్స్ చైర్మన్

టాటా ఎస్ఐఎ ఎయిర్‌లైన్స్ చైర్మన్

టాటా ఎస్ఐఎ ఎయిర్‌లైన్స్ చైర్మన్ యెయోహ్ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు.

ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ విలియం దర్ బుధవారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.

రాజధానికి విరాళం

రాజధానికి విరాళం

కువైట్ ఎన్నారై, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చేజెర్ల ఇంద్రకుమార్, కువైట్ సమన్వయకర్త సిహెచ్ వెంకట అప్పారావు రెండు లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu wants to give clean administration in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X