వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ రేసులో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandheswari along with Pawan Kalyan in RS race
హైదరాబాద్: తాజాగా బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటులో ఎవరిని భర్తీ చేస్తారనే విషయం రాజకీయవర్గాలలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది. మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ పేరు వినిపిస్తున్నప్పటికీ దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతితో ఓ స్థానం ఖాళీ అయింది.

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ను రాజ్యసభకు అవుతారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్‌ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా చెబుతున్నారు. రాజ్యసభ స్థానాన్ని బిజెపి అడుగుతోందని, ఇవ్వాలనుకుంటున్నామని ఆయన అన్నారని సమాచారం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీగా చేయాల్సి వుంది. ఆమె తెలుగువారి కోడలు కనుక, ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపినా పెద్దగా అభ్యంతరం రాదనే అభిప్రాయం వుంది.

ఆమెను మధ్యప్రదేశ్‌ నుంచి కూడా రాజ్యసభకు పంపే ఆలోచన కూడా పార్టీ కేంద్ర నాయకత్వంలో వుందని అంటున్నారు. అదే నిజమైతే ఎన్టీఆర్‌ కుటుంబంపై ప్రేమతో పురంధేశ్వరిని రాజ్యసభకు పంపిస్తారా అనే చర్చ కూడా సాగుతోంది.

ఇదిలావుంటే, సాధారణ ఎన్నికలలో ప్రధాన ప్రచార ఆకర్షణగా నిలిచిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను వదులుకోరాదని, ఎలాగైనా తమ పార్టీకి శాశ్వత మిత్రుడిగా పవన్ కళ్యాణ్‌ను చేసుకోవాలనే వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్లు సమాచారం. పవన్‌ అంగీకరిస్తే, ఈ సీటును ఆయనకు ఇవ్వాలని అనుకుంటు న్నారని సమాచారం. చంద్రబాబు కూడా దానికి సుముఖంగానే వున్నా రు.

అయితే పవన్‌ కొన్నాళ్లు సినిమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. కానీ రాజ్యసభ సభ్య త్వం అన్నది సినిమా వ్యవహారాలకు అడ్డురాదని, కళాకారుడిగా రాజ్యసభకు రావడం, తన వృత్తి కొనసాగించడం తప్పు కాదని, పవన్‌కు నచ్చ చెప్పాలని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఒకసారి కమలనాధుల వలలో పడితే ఇక జనసేన కార్యకలాపాలను ఆపాల్సి వస్తుంది. పార్టీని విస్తరించడానికి కూడా అవాకశం ఉండదు. దానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడతారా అనేది ప్రశ్న. మోడీ పట్టుపడితే కాదనకపోవచ్చునని అంటున్నారు.

English summary
It is said that Daggubati purandheswari is Rajyasabha race along with Janasena chief Pawan Kalyan from Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X