మరికొందరు సినీ స్టార్లకు నోటీసులు! పూరీ 'గుట్టు' విప్పిన శ్యామ్
డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా అవసరమైతే మరికొందరికి నోటీసులు జారీ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ గురువారం తెలిపారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా అవసరమైతే మరికొందరికి నోటీసులు జారీ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ గురువారం తెలిపారు.
రెండోరోజు విచారణలో శ్యాం కే నాయుడు సహకరించారని చెప్పారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతున్నదని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ కేసులో పాత్ర ఉన్న ఎవర్నీ వదులబోమని చంద్రవదన్ స్పష్టం చేశారు.

విచారణ అంశాలు గోప్యంగా..
కేసు దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందన్న చంద్రవదన్ చెప్పారు. విచారణకు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ సిట్‌కు సహకరించాలని తేల్చి చెప్పారు. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నామన్నారు. విచారణ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని, అయితే, సాధ్యమైనమేరకు దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. అంతటా గంభీర వాతావరణం నెలకొన్నదని చెప్పారు. విచారణ అంశాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Recommended Video


సిట్ అధికారుల ప్రశ్నలు ఇలా...
సిట్ కార్యాలయంలోకి విచారణకు వచ్చిన సిని తారలను సిసి కెమెరాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. లోపలకు వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ పైన వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. డ్రగ్స్ దందా గురించి మీకు తెలిసింది చెప్పాలని, డ్రగ్ పెడ్లర్స్‌తో ఉన్న ఫోటోలు చూపిస్తూ.. ఆ పరిచయం గురించి చెప్పాలని, ఫోన్ సంభాషణలు తదితరాల వాటిపై ఆరా తీస్తున్నారు.

ఎవరెవరు ఎప్పుడంటే..
బుధవారం పూరీ జగన్నాథ్‌ను, గురువారం శ్యామ్ కె నాయుడును, శుక్రవారం సుబ్బరాజును విచారించారు. అనంతరం 24న నవదీప్‌ను, 25న చిన్నాను, 26న చార్మీని విచారించనున్నారు. చార్మీని కూడా సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారని తెలుస్తోంది. రవితేజను 27న, నందును 28న, తనీష్‌ను 29న విచారించనున్నారు. ముమైత్ ఖాన్ తేదీ ఇంకా ఖరారు కాలేదు.

పూరీ గురించి షాకింగ్
పూరీ జగన్నాథ్ స్వయంగా డ్రగ్స్ వాడటమేకాకుండా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్‌తోపాటు కొందరు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేవారని శ్యాం కే నాయుడు సిట్ అధికారులకు చెప్పారని తెలుస్తోంది. ఈవెంట్లకు వచ్చేవారికి, ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు గుడ్‌విల్ కోసమే ఆయన డ్రగ్స్ అందించేవారని చెప్పారని తెలుస్తోంది.

అలా పీల్చుతారని..
ఈవెంట్, సీక్రెట్ పార్టీలు ఏర్పాటుచేసుకుని, ఎంపిక చేసిన వారిని ఆహ్వానించేవారని, వారంతా ఆనందోత్సాహాలతో గడిపేలా డ్రగ్స్ అందించేవారని శ్యామ్ కె నాయుడు చెప్పారని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ వాడకం ఎలా ఉంటుందో పలు ఆసక్తికర సంగతులను చెప్పారని అంటున్నారు. కొంతమంది సిగరెట్లలో, మరికొందరు పౌడర్ పీల్చడంలో నిష్ణాతులని చెప్పారని సమాచారం. పూరీ డ్రగ్స్ తీసుకుంటుండగా తాను పలుమార్లు చూశానని చెప్పినట్లు తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications