వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవి9 విక్రయానికి రంగం సిద్దం?: 'డీల్' కోసం చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు!..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగులో మొట్ట మొదటి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి శ్రీని రాజు.. తన వాటాను విక్రయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

<strong>టీవి9 ను ఆ సంస్థ కొనుగోలు చేయనుందా? డీల్ ఎంతకి?</strong>టీవి9 ను ఆ సంస్థ కొనుగోలు చేయనుందా? డీల్ ఎంతకి?

వాటాల విక్రయం కోసం గతంలోను జీ టీవి సంస్థతో శ్రీని రాజు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ కారణాల చేతనో అప్పట్లో ఓ కొలిక్కి రాని ఈ వ్యవహారం.. మరోసారి చర్చల దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దఫా నాలుగు మీడియా సంస్థలు టీవి9లో మెజారిటీ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు.

శ్రీనిరాజుదే మెజారిటీ వాటా:

శ్రీనిరాజుదే మెజారిటీ వాటా:

టీవీ9 పేరుతో తెలుగు, కన్నడ, గుజరాత్‌, మరాఠీ, ఇంగ్లీష్‌ భాషల్లో వార్తా ఛానల్స్‌ నిర్వహిస్తున్న 'అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌' (ఎబిసిఎల్‌) ఈక్విటీలో శ్రీనిరాజుకు 60శాతం వాటాలున్నాయి. ఆయన నిర్వహణలోని పీపుల్‌ క్యాపిటల్‌ ఎల్‌ఎల్‌సి, అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ (పిఇ) సంస్థ సైఫ్‌ పార్ట్‌నర్స్‌ కు 20శాతం వాటా ఉంది. అలాగే టీవి9 సీఈవో రవిప్రకాశ్ కు 20శాతం వాటా ఉంది.

ఎబిసిఎల్ విలువెంత?

ఎబిసిఎల్ విలువెంత?

శ్రీనిరాజు తన వాటాను విక్రయించడానికి సిద్దపడటంతో.. పిడబ్ల్యుసి, డెలాయిట్‌, కెపిఎంజి, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ వంటి ఆర్థిక సేవల కంపెనీలు.. ఎబిసిఎల్‌ విలువను లెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో 10రోజుల్లో ఈ లెక్కలన్ని ఓ కొలిక్కి రాగా.. అత్యధిక బిడ్ తో ముందుకు వచ్చే కంపెనీకే వాటను విక్రయించనున్నారు.

డీల్ వెయ్యి కోట్లకా?:

డీల్ వెయ్యి కోట్లకా?:

టీవి9లో మెజారిటీ వాటా విక్రయాలకు సంబంధించి.. శ్రీనిరాజు ఎంత 'డీల్'ను ఆశిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రూ.850కోట్ల నుంచి రూ.1000కోట్ల వరకు విక్రయ ఒప్పందం జరగవచ్చునని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా వెంచర్ క్యాపిటలిస్టులు, పిఇ సంస్థలు ఏదైనా ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టిన తర్వాత.. ఏడెనిమిదేళ్లలో వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ టీవి9 విషయంలో మాత్రం శ్రీనిరాజు 12ఏళ్ల పాటు తన వాటాను అలానే కొనసాగిస్తూ వస్తున్నారు.

తెలుగు, కన్నడ టాప్!:

తెలుగు, కన్నడ టాప్!:

ఇక టీవి9 రేటింగ్స్ విషయానికి వస్తే.. తెలుగు, కన్నడ భాషల్లోని ఛానెల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీవీ9 గుజరాతీ, మరాఠి, జై తెలంగాణ ఛానల్స్‌ మాత్రం వీక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి.

English summary
Venture capitalist Chintalapati Srinivasa Raju (Srini Raju) owns about 60 per cent stake in ABCL, US-based private equity firm Saif Partners holds 20 per cent while the TV9 founder and Chief Executive Officer Ravi Prakash and his associates hold the remaining 20 per cent stake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X