వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గే' వివాహాలకు చట్టబద్దత!: తీర్పుపై తైవాన్‌లో ఉత్కంఠ..

కోర్టు తీర్పు గే వివాహాల చట్టబద్దతకు అనుకూలంగా వెలువడితే.. మరుసటి రోజు నుంచే దాన్ని అమలులోకి తీసుకురావాలని చియావే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

|
Google Oneindia TeluguNews

తైవాన్: స్వలింగ సంపర్కుల(గే) వివాహాలను చట్టబద్దం చేసిన తొలి ఆసియా దేశంగా తైవాన్ చరిత్రలోకి ఎక్కనుంది. ఈ మేరకు బుధవారం నాడు గే వివాహాలను చట్టబద్దం చేసే విషయంపై అక్కడి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పు గే వివాహాల చట్టబద్దతకు అనుకూలంగా ఉంటే.. ఆసియాలోనే ఈ చట్టాన్ని అమలు చేసే తొలి దేశంగా తైవాన్ పేరు నిలిచిపోతుంది.

తైవాన్ లోని స్వలింగ సంపర్కులంతా కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో ఉన్నారు. తైవాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4గం.కు 14మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. గే వివాహాల చట్టబద్దతపై ఆన్ లైన్ ద్వారా తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని గే హక్కుల ప్రచారకర్త చి చియావే(59) విశ్వాసం వ్యక్తం చేశారు.

Taiwan court to rule in in landmark same-sex marriage case

కోర్టు తీర్పు గే వివాహాల చట్టబద్దతకు అనుకూలంగా వెలువడితే.. మరుసటి రోజు నుంచే దాన్ని అమలులోకి తీసుకురావాలని చియావే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తీర్పు వెలువడ్డాక.. ఈ విషయంలో ప్రభుత్వానికి సుదీర్ఘ గడువు ఇవ్వరాదని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో ఇలాంటి చట్టాలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని 'గే' వివాహాల చట్టబద్దతను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సమాజాన్ని విభజించే ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని నిరసనకారులంతా రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులంతా బుధవారం మధ్యాహ్నాం సెంట్రల్ తైపేయిలో గే వివాహాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.

English summary
Judges in Taiwan are due to decide whether it will become the first place in Asia to recognise same-sex marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X