హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు: ఎల్ అండ్ టీని అబ్బురపరిచిన కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎల్‌ అండ్‌ టీ కంపెనీ రూటు మార్చింది! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకం కాదని ఆందోళన వ్యక్తం చేస్తూ వరుసగా లేఖలు రాసిన కంపెనీ యాజమాన్యం, ఇపుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారని కంపెనీ చైర్మన్‌ నాయక్‌ కొనియాడారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ సాధించాలనే కేసీఆర్‌ సంకల్పం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు.

 Telangana to keep L&T in the loop on metro rail alignment

ఇందుకు ఎల్‌ అండ్‌ టీ కంపెనీ తరఫున అన్ని విధాల చేయూత అందిస్తామన్నారు. ఇటీవల కేసీఆర్‌ను కలిసినపుడు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్టు చెప్పారు. కేసీఆర్‌ చొరవ, ముందు చూపు ఉన్న నేత అని ఆయన కొనియాడారు.

ప్రణాళిక, దూరదృష్టి ఉన్న కేసీఆర్‌ లాంటి నేతల వలనే దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ భాగస్వామి అవుతుందన్నారు. తెలంగాణలో చేపట్టే విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తమ వంతు సహకారమందిస్తామన్నారు.

సూరత్‌ సమీపంలోని హజీరాలో ఉన్న తమ కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించేందుకు రావాలని నాయక్‌ కేసీఆర్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన రూపొందించిన ప్రణాళిక అబ్బురపరిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

English summary
The Telangana State government and its special purpose vehicle overseeing the metro rail project, Hyderabad Metro Rail (HMR), have finally decided to officially inform the L&T Metro Rail Hyderabad (L&TMRH) on Wednesday about the alignment changes required in three sites across the two of the three corridors where the metro rail is being built.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X