వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలమేశ్వర్‌దే చొరవ: ఎవరీ నలుగురు సుప్రీం జడ్జీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్..!

న్యూఢిల్లీ: అనూహ్యంగా నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం నాడు జరిగిన ఈ మీడియా సమావేశం తీవ్ర సంచలనం సృష్టించింది.

జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు నలుగురు న్యాయమూర్తులు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనే అనూహ్యమైన నిర్ణయాన్ని జస్టిస్ చలమేశ్వర్ తీసుకున్నారు. చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందనవారనే విషయం తెలిసిందే.

 జస్టిస్ చలమేశ్వర్

జస్టిస్ చలమేశ్వర్

సుప్రీంకోర్టులో ఆయన ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్నారు. ఇంతకు ఆయన కేరళ, గౌహతి హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. చలమేశ్వర్ ఒకప్పుడు ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎంతో జాప్యం తర్వాత ఆయన 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు దానివల్ల ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయారని అంటారు.

 జస్టిస్ మదన్ లోకూర్

జస్టిస్ మదన్ లోకూర్

మదన్ బి లోకూర్ న్యాయవాదిగా 1977లో బార్‌లో పేరు నమోదు చేసుకున్నారు. సుప్రీంకోర్టులోనూ ఢిల్లీ హైకోర్టులోనూ పనిచేశారు. అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఎఓఆర్) పరీక్ష పాసై 1981లో సుప్రీంకోర్టు ఎఓఆర్‌గా పేరు నమోదు చేసుకున్నారు. 1983 ఫిబ్రవరి నుంచి ఇండియన్ లా రివ్యూ (ఢిల్లీ సిరీస్) సంపాదకుడిగా పనిచేశారు. 1999 జులై 5వ తేదీన హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు

ఆయన 2010 ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 2010 మే 21వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఆ తర్వాత 2010 జూన్ 24 నుంచి 2011 నవంబర్ 14వ తేదీ వరకు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2011 నవంబర్ 11వ తేదీ నుంచి 2012 జూన్ 3వ తేదీ వరకు పనిచేశారు. 2012 జూన్ 4వ తేదీన ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేరారు.

జస్టిస్ జోసెఫ్ కురియన్

జస్టిస్ జోసెఫ్ కురియన్

జోసెఫ్ కురియన్ 2000లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2010 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 8వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఆయన 1996లో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఆన ఇండియన్ లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేరళ బ్రాంచ్ చైర్మన్గ , ఇండియన్ లా రిపోర్ట్స్ (కేరళ సిరీస్) చైర్మన్‌గా, నేషనల్ యూనివర్శిటి ఆఫ్అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేసారు.

 జస్టిస్ రంజన్ గోగోయ్

జస్టిస్ రంజన్ గోగోయ్

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్. జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత 2018 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. ఆ పదవిలోకి వచ్చే తొలి బారత ఈశాన్య రాష్ట్రాల తొలి న్యాయమూర్తి అవుతారు.

గోగోయ్ 1978లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 ఫిబ్రవి 28వ తేదీన పర్మినెంట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన 2010 సెప్టెంబర్ 9వ తేదన పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగా, 2011 ఫిబ్రవరి 9వ తేదీన హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

ఆయన 2012 ఏప్రిల్ 23వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కేశవ్ చంద్ర గోగోయ్ అస్సాంముఖ్యమంత్రిగా పనిచేశారు.

English summary
For the first time probably in the history of India, four top judges of the Supreme Court addressed a press conference on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X