ధోనీకి అంతలేదు! కోహ్లీయే బెస్ట్ ఫినిషర్: గౌతం గంభీర్
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టులో ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బెస్ట్ ఫినిషర్‌గా అందరూ భావిస్తారు. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం... తన దృష్టిలో విరాట్ కోహ్లీయే బెస్ట్ ఫినిషర్ అని చెబుతున్నాడు. మ్యాచ్‌ను ముగించడంలో మెరుగైనవాడు ధోనీ కాదని, కోహ్లీయే అని చెబుతున్నాడు.
మ్యాచ్‌ను ముగించడంలో ధోనీని మించిన ఆటగాడు లేడని మీడియానే ఓ ముద్ర వేసిందని, నా దృష్టిలో మాత్రం బెస్ట్ ఫినిషర్ విరాట్ కోహ్లియే అని చెప్పాడు. ఆరు లేదా ఏడో స్థానంలో వచ్చే ఆటగాడే మ్యాచ్‌కు ముగింపు ఇవ్వాలనేమీ లేదని, ఆ పని ఓపెనర్ కూడా చేయవచ్చునని చెప్పాడు.

ధోనీకి మీడియానే బెస్ట్ ఫినిషర్ అనే ట్యాగ్ ఇచ్చిందన్నాడు. కచ్చితంగా అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో చెప్పాలన్నాడు. ఆరేడు ఏడు స్థానాల్లో వచ్చిన వారిని బెస్ట్ ఫినిషర్ అనాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ ఒక్కడే మెరుగ్గా ఆడితే సరిపోదని, జట్టు మొత్తం రాణిస్తేనే విజయం వరిస్తుందన్నాడు.
మరోవైపు, కోహ్లి మాత్రం ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ ధోనీయేనని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ... ధోని వచ్చాడు, ముగించాడు అన్నాడు. ప్రపంచంలోనే ధోని అత్యుత్తమ ఫినిషర్ అని, అందులో సందేహమే లేదని, శిఖర్ ధావన్ కూడా బాగా ఆడాడని చెప్పాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications