చీపురు: ఆంధ్రలో పవన్, తమిళనాడులో విశాల్?

యువ హీరో విశాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. తమిళనాడులో ఆమ్ ఆద్మీ పార్టీ పగ్గాలను విశాల్ చేతికి అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే ఉద్యమించినప్పుడు చాలా మంది నటీనటులతో పాటు విశాల్ కూడా మద్దతు పలికారు. అయితే, ఈ విషయంపై విశాల్ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, మరో ప్రముఖ తమిళ నటుడు విజయ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ చర్చలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలపై దృష్టి సారించి వరుస విజయాలు సాధిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెడుతారా అనేది కొంత అనుమానంగానే ఉంది. కానీ, స్వతహాగా ఉద్గేవ స్వభావి అయన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా రావచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications