షాకింగ్: 'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సమస్యేంటి'

భోపాల్: 'పాకిస్తాన్ జిందాబాద్ అంటే మీకు సమస్య ఏమిటి' అని ఓ న్యాయవాది న్యాయస్థానంలో డిఎస్పీని అడిగిన సంఘటన చోటు చేసుకుంది.

రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిన విషయం తెలిశాక.. కోర్టు ప్రాంగణంలోనే పాకిస్తాన్, తాలిబాన్లకు అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సిమి కార్యకర్త పర్వేజ్ ఆలమ్ విచారణ ఎదుర్కొంటున్నాడు.

What problem do you have with 'Pakistan Zindabad' slogans, lawyer questions DSP

దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సిమి కార్యకర్త పర్వేజ్ ఆలమ్ తరఫు న్యాయవాది కోర్టులో ఓ డీఎస్పీ స్థాయి అధికారిని పై ప్రశ్న అడిగాడు. భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా డిఫెన్స్ లాయర్ ఈ ప్రశ్న వేశాడు. ఇది అక్కడ ఉన్న వారిని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

దీనిపై సదరు డీఎస్పీ తడుముకోకుండా సమాధానం చెప్పారు. కోర్టు పరిసరాల్లో తమ మనోభావాలు, భావజాలాలను వ్యక్తం చేస్తూ ఎలాంటి నినాదాలు చేయకూడదని గుర్తు చేశారు. అలా నినదించడం భారత శిక్షాస్మృతి మేరకు నేరమన్నారు. డిఎస్పీ ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+