వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెస్ట్: అధికారికి లంచం ఇవ్వజూపిన కేజ్రీవాల్ కూతురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో అవినీతి ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత స్వయంగా ప్రయత్నించారు. ఎల్ఎల్ ఆర్ కోసం హర్షిత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినా అధికారి తిరస్కరించారు.

తాను ఎవరో చెప్పకుండా హర్షిత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. వాహనాన్ని నడపడం నేర్చుకునేందుకు అవసరమయ్యే అనుమతి పత్రం (ఎల్ఎల్ఆర్) కోసం దరఖాస్తు చేశారు. తనవంతు వచ్చేసరికి ముఖ్యమంత్రి కూతురు నిరీక్షించారు.

అవసరమైన పత్రాల్లో ఒకటి లేదనీ, అయితే లైసెన్స్ తనకు అత్యవసరమని ఆమె చెప్పింది. కాబట్టి తాను ఎంత లంచమైనా ఇచ్చేందుకు సిద్ధమని ఆమె అక్కడి అధికారితో చెప్పింది.

 When Arvind Kejriwal's daughter offered 'bribe' to test official

ఆమె సెల్‌ఫోన్‌లో దానిని చిత్రీకరిస్తుందేమోనని సదరు అధికారి తొలుత అనుమానించాడు. అలాంటిదేమీ లేదని ధృవీకరించుకుంది. అయినప్పటికీ లంచం తీసుకునేందుకు నిరాకరించారు. బయటకు వచ్చిన ఆమె, కొద్ది సేపట్లో మళ్లీ వెనక్కి వెళ్లి మిగిలిన పత్రాన్ని కూడా సమర్పించింది.

అందులో తండ్రిపేరు అని ఉన్నచోట అరవింద్ కేజ్రీవాల్ అనే పేరును అతను చూశాడు. ఆమె ముఖ్యమంత్రి కుమార్తె అవునో కాదో అధికారి అడిగి తెలుసుకున్నారు. అధికారులు తరలి వచ్చి ఆమె పనిని పూర్తి చేశారు. ఆదివారం ఆటో డ్రైవర్ల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

దీని గురించి చెప్పిన అరవింద్ కేజ్రీవాల్... ఢిల్లీలో లంచం తీసుకోవడం డెబ్బై నుండి 80 శాతం మేర తగ్గిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఇది జరిగిందన్నారు. తాము వంద శాతం లంచం లేకుండా చేస్తామని చెప్పలేమని, అయితే 80 శాతం వరకు తగ్గిందన్నారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Sunday claimed corruption had come down by "70-80 per cent" after Aam Aadmi Party came to power and cited how his daughter tested an official with a 'bribe' offer when she went to get her driving license.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X