సోనియా ఎదుట పవన్‌పై చిరంజీవి మాటల దాడి

రాజకీయ రంగంలో మెగా సోదరులు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార సారథి చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పవన్ మాటలకు చిరంజీవి పరోక్షంగా ఘాటుగానే స్పందిస్తున్నారు.

శుక్రవారం ఏకంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలోనే పవన్ కళ్యాణ్‌పై చిరంజీవి పరోక్ష దాడి చేశారని చెప్పవచ్చు. పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి కాంగ్రెస్ హఠావో అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దేశంలో కాంగ్రెసు పార్టీ పోతేనే దేశం బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Word war between Pawan Kalyan and Chiranjeevi

కాంగ్రెసు పార్టీని ఓడించేందుకే తాను టిడిపి, బిజెపి కూటమికి మద్దతు పలికానని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అని ఆయన నినదిస్తున్నారు. తెలంగాణలో ఆయన కాంగ్రెసు, తెరాసల పైన నిప్పులు చెరిగారు. సీమాంధ్రలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు.

అయితే, కాంగ్రెస్ హఠావో అన్న పవన్ వ్యాఖ్యలకు చిరు పరోక్షంగా ధీటుగానే స్పందిస్తున్నారు. కాంగ్రెసు పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరని పలు సందర్భాల్లో చెప్పారు. కొద్ది రోజుల క్రితం పవన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... పవన్ కాదు ఎవరు వచ్చిన కాంగ్రెసు పార్టీని ఎవరు ఏం చేయలేరన్నారు. శుక్రవారం సోనియా గాంధీ సభలో పవన్‌ను చిరు టార్గెట్ చేశారనే చెప్పవచ్చు. సోనియా సభలో చిరు మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+