Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అద్భుతం: స్కేటింగ్ చేస్తూ రాజధాని అమరావతికి

అమరావతి: చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు, వృద్ధులు, మహిళలతో పాటు చిన్నారులు సైతం శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

చిత్తూరు జిల్లా నారావారి పల్లె నుంచి దేవీశ్రీప్రసాద్ అనే ఓ బాలుడు మట్టి-నీరు తీసుకుని స్కేటింగ్ చేస్తూ అమరావతికి చేరుకున్నాడు. నారావారి పల్లె నుంచి మోటర్‌బైక్ ర్యాలీతో స్కేటింగ్ చేసుకుంటూ రాజధాని శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగే సభా ప్రాంగణానికి చేరుకున్నాడు.

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సభాస్థలిలో సర్వమత ప్రార్థనలు చేసి, శంఖం పూరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంకుస్థాపన మహోత్సవంలో సింగపూర్, జపాన్ మంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, విదేశీ ప్రతినిధులు, ప్రజలతో ఉద్దండరాయునిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది.

Young Boy reaches Amaravati Ceremony by Skating

మరోవైపు రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనానికి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం ఆహార ప్యాకెట్లను సిద్ధం చేసింది. ఒక్కో ప్యాకెట్లో చక్కపొంగలి, దద్దోజనం, తాపేశ్వరం కాజా, పులిహోరా, వాటర్ బాటిల్‌తో దాదాపు రెండు లక్షల ఆహార ప్యాకెట్లను తయారు చేశారు.

మధ్యాహ్నం సరిగ్గా 12.36 నుంచి 12.43 నిమిషాల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ విదేశీ ప్రముఖులు, లక్షలాది ప్రజల సమక్షంలో అమరావతి శంకుస్థాపన చేయనున్నారు. ఈ శుభ ఘడియ కోసం ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు. దాదాపు 500 ఎకరాల్లో మంత్రులు, అధికారులు, వందలాది కార్మికులు రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు పాటుపడి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

33,500 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు తమ కుటుంబాలతో సహా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. లక్ష మంది కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు అయినప్పటికీ మరో లక్ష మంది అదనంగా రాగలరని అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవానికి 4,10,000 ఆహ్వాన పత్రాలు వెళ్లాయి.

ప్రధాన మంత్రితో పాటు ముఖ్యమంత్రి, సింగపూర్, జపాన్ మంత్రులు, కేంద్ర మంత్రులు మొత్తం 15 మంది కూర్చునేందుకు వీలుగా 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో కూడిన ప్రధాన వేదికను 15 అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. దీనికి రెండువైపులా ఒక్కొ వేదికపై 300 మంది చొప్పున కూర్చునేలా అటు, ఇటు రెండు వేదికలు ఏర్పాటు చేశారు.

36 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో సమీపంలో హోమశాల నిర్మాణం జరిగింది. ప్రధాన వేదికకు ఎదురుగా సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాటైంది. దానికి ఇరువైపులా ప్రత్యేక ఆహ్వానితులు 6000 మంది కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల వేదికకు ముందువరుసలో భూములిచ్చిన 30 వేల మంది రైతులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోడీ కోసం వేదికకు సమీపంలో నాలుగు హెలిప్యాడ్‌లు ఏర్పాటు కాగా ఇతర ప్రముఖుల కోసం మరో ఐదు హెలిప్యాడ్‌లు ఏర్పాటయ్యాయి. పూర్తి శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగే విధంగా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుండే యాగశాలలో పూజలు ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి హోమం జరుగుతుంది.

12.36 నుండి 12.43 మధ్య శంకుస్థాపనకు సంబంధించిన ప్రధాన క్రతువు ఉంటుంది. అనంతరం ప్రధానిచే పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి శంకుస్థాపన ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ప్రధాన వేదికకు పక్కనే అమరావతి ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. దానిని ప్రధాని మోడీ సందర్శించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+