బాబు మనిషి: పవన్ కల్యాణ్‌పై జగన్ వ్యూహాత్మక ఎదురుదాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తనపై విమర్శనాస్త్రాలు సంధించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మక ఎదురుదాడికి దిగారు. పవన్ కల్యాణ్ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

  Pawan Kalyan Tour: I Don't Know Pawan Kalyan Says YS Jagan

  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా శింగనమల మండలం కల్లుమడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

   మా బృందం వస్తుందనే పవన్ కల్యాణ్

  మా బృందం వస్తుందనే పవన్ కల్యాణ్

  తమ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్తోందని తెలిసి పవన్ కల్యాణ్ కూడా అక్కడికి వెళ్లారని జగన్ అన్నారు. సినిమాలు తీసుకుంటూ ఎక్కడో ఉంటున్న పవన్ కల్యాణఅ ఏదిచేసినా మూడు రోజుల హడావుడిగా మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు.

  పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా చూశారా...

  పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా చూశారా...

  వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని పవన్ అంటున్నారని, దాన్ని ప్రత్యక్షంగా చూశారా? అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని జగన్ అన్నారు. కాంగ్రెస్ అవినీతిమయమైతే ప్రజా రాజ్యం పార్టీనిఅందులో ఎందుకు విలీనం చేశారని అడిగారు. ఆ విలీనంలో ఎంత అవినీతి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.

   ఏ అనుభవం ఉందని అలా చేశారు...

  ఏ అనుభవం ఉందని అలా చేశారు...

  రాజకీయాల్లో అనుభవం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని అంటూ ఏ అనుభవం ఉందని ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజారాజ్యం పార్టీని ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని అంటున్నా సీఎం చంద్రబాబును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు.

   పోలవరం నిధులు పక్కదారి...

  పోలవరం నిధులు పక్కదారి...

  పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టించారని, దీంతో ఆ ప్రాజెక్టు అవినీతికి నిలయంగా మారిందని జగన్ అన్నారు. దీంతో కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసిందని అన్నారు. తమ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుండగా బురద చల్లే విధంగా పవన్ మాట్లాడటం సరికాదన్నారు.

   పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు నాటకం

  పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు నాటకం

  పవన్ కల్యాణ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటకం ఆడిస్తున్నారని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్యలన తొలుత పార్లమెంట్‌లో ప్రస్తావించింది తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అని ఆయన గుర్తుచేశారు.

   అలా చెప్పడం ద్వారా...

  అలా చెప్పడం ద్వారా...

  పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం కాదని, తమ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని జగన్ చెప్పదలుచుకున్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం తమ పార్టీని దెబ్బ తీయడానికి పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు మళ్లించుకోవడానికి తమ పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన భావించి ఉంటారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Pary president YS Jagan has strategically countered Jana Sena chief Pawan Kalyan in his Praja sankalpa yatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి