వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై రంగంలోకి జగన్, నవ్విన రోజా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది.

రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా ప్రచారం చేసుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధ్వజమెత్తింది.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకు అనుగుణంగా షరతులు ఏమీ లేకుండా మొత్తం రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో భారీ ఎత్తున ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఈ నిర్ణయం మేరకు వచ్చే నెలలో మొదట మండల కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఆ తర్వాతి దశలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతారు. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకుంటే వైయస్ జగన్ స్వయంగా ఏదో ఒక జిల్లాలో ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారు. ఈ మేరకు త్వరలోనే ఆందోళన తేదీలను ఖరారు చేస్తారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

జగన్ అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి విజయమ్మ, మైసూరా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు పైన చర్చ జరిగింది. రుణమాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శించింది.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

జిల్లా స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను జగన్ ఈ సమావేశంలో వివరించారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

రుణమాఫీ హామీని అమలు చేయాలని వైయస్ జగన్ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినా ప్రయోజనం కనిపించలేదని, దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ విమర్శించింది.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

మండల, జిల్లా స్థాయిలో తాము చేపట్టే ఆందోళనలను చూసైనా టీడీపీ ప్రభుత్వం దిగి వచ్చి రుణాలన్నింటిని మాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని, అప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోతే జగన్ స్వయంగా ఆందోళనకు స్వీకారం చుడతారన్నారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది.

English summary
YSR Congress will highlight "failures" of the TDP led Andhra Pradesh government in implementing its poll promises, especially loan waiver of farmers and women groups, through agitation programmes starting next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X