Gmail: మీ జీమెయిల్ ఖాతా వచ్చే నెలలో డిలీట్ కావొచ్చు ? గూగుల్ అప్ డేట్..!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న మెయిల్ అప్లికేషన్ జీమెయిల్. అయితే జీమెయిల్ కు ఎంత ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారో, అంతే మంది ఫేక్ వినియోగదారులు కూడా పెరిగిపోయారు. అంటే తాత్కాలిక అవసరాల కోసం జీమెయిల్ ఖాతాలు తెరవడం, ఆ తర్వాత వాడకుండా వదిలేస్తున్న వారు. ఇలాంటి ఖాతాల వల్ల హ్యాకింగ్ తో పాటు ఇతర సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇలా దీర్ఘకాలంగా వాడకుండా వదిలేసిన ఖాతాల్ని నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేసేయాలని గూగుల్ నిర్ణయించింది. కనీసం రెండేళ్ల పాటు ఇనాక్టివ్ గా (వాడకుండా వదిలేయడం) ఉన్న జీమెయిల్ ఖాతాల్ని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. వచ్చే నెలలో అటే డిసెంబర్ 2023లో ఇలా రెండేళ్లుగా ముట్టుకోని లక్షలాది ఖాతాల్ని డిలీట్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై సదరు ఖాతాదారులకు ఇప్పటికే అలర్ట్స్ పంపుతోంది. ఈ అలర్ట్ చూసుకుని ఇకనైనా ఖాతా వాడితే మంచింది. ఆ గూగుల్ ఏం చేస్తుందిలే అని వదిలేస్తే మాత్రం మీ ఖాతా డిలీట్ కావడం ఖాయమంటున్నారు నిపుణులు.

తమ ఖాతాలను రెగ్యులర్ గా వాడని జీమెయిల్ వినియోగదారులు డిసెంబర్లో తమ ఖాతాల యాక్సెస్ కోల్పోయే అవకాశం ఉన్నట్లు గూగుల్ చెబుతోంది. ఈ ఏడాది మేలో గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ రాసిన బ్లాగ్ పోస్ట్‌లో రిస్క్‌ను తగ్గించడానికి తాము చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గూగుల్ ఉత్పత్తుల విషయంలో తమ విధానాన్ని రెండేళ్లకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నుండి గూగుల్ ఖాతాను కనీసం 2 సంవత్సరాలుగా ఉపయోగించకుంటే లేదా సైన్ ఇన్ చేయకుంటే, తాము గూగుల్ వర్క్ స్పేస్ (జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్ ) అలాగే గూగుల్ ఫోటోలలోని కంటెంట్‌తో సహా ఖాతాను తొలగించవచ్చు .
ఎందుకంటే మరచిపోయిన లేదా గమనింపబడని ఖాతాలు తరచుగా పాత లేదా మళ్లీ ఉపయోగించిన పాస్‌వర్డ్‌లపై ఆధారపడతాయని, అవి ఇప్పటికే భద్రత విషయంలో రాజీ పడి ఉండొచ్చని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే టూ స్పెప్ వెరిఫికేషన్ కూడా వీటికి జరగలేదని, కాబట్టి వీటి వినియోగదారులకు సెక్యూరిటీ అలర్ట్ లు కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఖాతాల్ని గుర్తించి తొలగించి తమ రిస్క్ తగ్గించుకోవాలని గూగుల్ భావిస్తోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications